31 December 2025
ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా షేక్.. దెబ్బకు క్యూ కట్టిన ఆఫర్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో నేషనల్ క్రష్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రుక్మిణి వసంత్. ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలే చేస్తుంది.
రుక్మిణి వసంత్.. ఇప్పుడు ఈ అమ్మడి చెంత అదృష్టమే నిలిచింది. సప్త సాగరాలు దాచే సినిమాతో దక్షిణాది అడియన్స్ దృష్టిని ఆకర్షించింది.
తర్వాత కాంతార చాప్టర్ 1 మూవీతో మొత్తం పాన్ ఇండియా అడియన్స్ హృదయాలు దోచేసింది. కన్నడ, తమిళంలో అలరిస్తుంది.
ఇప్పుడు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతుంది. కాంతార తర్వాతా ఈ అమ్మడుకు సౌత్ లో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
టాలీవుడ్, కోలీవుడ్ ఆమె అందానికి, నటనకు ఫిదా అయిపోయినట్లే కనిపిస్తుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్, ఇన్నోసెంట్ ఫేస్ ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ సైతం నటిస్తున్నారు.
అలాగే ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలోనూ నటిస్తుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.
అలాగే తమిళంలో డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయనుందని టాక్. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్