బొప్పాయి ఆకులతో అందం రెట్టింపు..!
31 December 2025
Jyothi Gadda
బొప్పాయి ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు ఎలా ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. బొప్పాయి ఆకు కూడా అంతే ప్రయోజనకరం అని మీకు తెలుసా..?
ఈ ఆకులు ఉపయోగించి మీ చర్మాన్ని మరింత ఆరోగ్యవంతంగా, మెరిసేలా తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం...
ఇప్పుడు, ఈ ఆకులను చిక్కటి పేస్ట్ లా రుబ్బుకోండి. తరువాత, రసాన్ని వడకట్టి, అందులో ఇప్పుడు తేనె, శనగపిండి పొడి కలపండి.
ఈ పేస్ట్‌ను అవసరమైనంత నీటితో కలిపి మీ ముఖానికి అప్లై చేయండి. 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
బొప్పాయి ఆకులలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
బొప్పాయి ఆకులు మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. చర్మంపై మచ్చలను తొలగిస్తుంది.
శనగ పిండి చర్మంపై అదనపు నూనె, మురికిని తొలగించడంలో సహాయపడతాయి. శనగ పిండి టానింగ్‌ను తొలగించి చర్మపు రంగును ప్రకాశవంతం చేస్తుంది.
తేనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. ఇది మొటిమలు, ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షించి సహజ మెరుపునిస్తుంది.