AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: కొత్త ఏడాది సందర్భంగా ఆర్బీఐ బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు దక్కని ఊరట

ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రెండో దశ చెక్కుల క్లియరెన్స్ ప్రాసెస్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 3వ తేదీ నుంచి అమలు చేయాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసింది. దీంతో వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోెకి తెచ్చే అవకాశముంది.

Venkatrao Lella
|

Updated on: Dec 31, 2025 | 8:25 PM

Share
నూతన సంవత్సరం సందర్భంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంకింగ్ కస్టమర్లకు ఉపయోగపడే ఓ నిర్ణయంపై బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. బ్యాంక్ చెక్కులను గంటల వ్యవధిలోనే ప్రాసెస్ చేసే రెండో దశ నిర్ణయాన్ని వాయిదా వేసింది. 2025 అక్టోబర్ 4 నుంచి తొలి దశను అమలు చేస్తోండగా. జనవరి 3 నుంచి రెండో దశల చెక్కుల క్లియరెన్స్ ప్రాసెస్ అమలు చేయాల్సి ఉంది.

1 / 5
కానీ బ్యాంకులు సిద్దంగా లేకపోవడం, అమలు చేసేందుకు మరింత సమయం కోరడంతో ఆర్బీఐ వాయిదా వేసింది. తొలి దశలో చెక్కులు త్వరగా క్లియర్ చేయడంలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఉద్యోగులు తక్కువమంది ఉండటంతో వేగంగా క్లియర్ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలను పునరుద్దరించుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ సమయం ఇచ్చింది.

2 / 5
గతంలో బ్యాంకులో చెక్ డిపాజిట్ చేయగానే తర్వాతి రోజు ప్రాసెస్ చేసేవారు. కానీ ఆర్బీఐ దీనిని వేగవంతం చేసేందుకు గంటల వ్యవధిలోనే చెక్కులను బ్యాంకులు క్లియర్ చేసేలా రూల్స్ తీసుకొచ్చింది. తొలి దశలో చెక్కు డిపాజిట్ చేసే రోజే క్లియర్ చేసేలా రూల్స్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం  ఇది అమలవుతోంది.

3 / 5
ఇక చెక్కుల ధృవీకరణకు ఇప్పటివరకు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు సమయం ఉండేది. దీనిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సవరిస్తూ మార్పులు చేసింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి మూడు గంటల్లోనే చెక్కు క్లియర్ చేసే నిర్ణయాన్ని ఆర్బీఐ అమలు చేసే అవకాశమంది.

4 / 5
రెండో దశలో చెక్కు డిపాజిట్ చేసిన మూడు గంటల్లోనే బ్యాంకులు క్లియర్ చేసేలా జనవరి 3 నుంచి నిబంధనలు అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. కానీ కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆ నిర్ణయాన్ని ఇప్పుడు వాయిదా వేసింది. తొలి దశలో భాగంగా చెక్కుల సమర్పణ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఆర్బీఐ సవరించింది

5 / 5