AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెండా పడిన వైపే పాడిపంటలు.. అడవి బిడ్డల హోలీ సంబరాలు ప్రత్యేకం.. రంగులకంటే ఎక్కువ కలర్‌ఫుల్‌

అల్లూరి ఏజెన్సీలో హోలీ సంబరాలు వేడుకగా జరిగాయి. కేవలం రంగులు పూసుకోవడమే కాదు... సాంప్రదాయ బద్ధంగా మద్ది కర్రలను కాల్చడం ఇక్కడ ఆనవాయితీ. అందులో ఒక జెండా పెట్టి.. కట్టెలు కాలిన తర్వాత ఆ జెండా ఎటువైపు పడితే అటువైపు పంటలు పుష్కలంగా పండుతాయి అన్నది గిరిజనుల విశ్వాసం. మరి.. తాజంగి, దారెల లలో పూర్వకాలం నుంచి సాగుతున్న హోలీ వేడుకలు ఒకసారి తెలుసుకుందామా...

జెండా పడిన వైపే పాడిపంటలు.. అడవి బిడ్డల హోలీ సంబరాలు ప్రత్యేకం.. రంగులకంటే ఎక్కువ కలర్‌ఫుల్‌
Alluri Agency Holi Celebrations
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 06, 2026 | 2:14 PM

Share

అల్లూరి ఏజెన్సీలో హోలీ సంబరాలు వేడుకగా జరిగాయి. కేవలం రంగులు పూసుకోవడమే కాదు… సాంప్రదాయ బద్ధంగా మద్ది కర్రలను కాల్చడం ఇక్కడ ఆనవాయితీ. అందులో ఒక జెండా పెట్టి.. కట్టెలు కాలిన తర్వాత ఆ జెండా ఎటువైపు పడితే అటువైపు పంటలు పుష్కలంగా పండుతాయి అన్నది గిరిజనుల విశ్వాసం. మరి.. తాజంగి, దారెల లలో పూర్వకాలం నుంచి సాగుతున్న హోలీ వేడుకలు ఒకసారి తెలుసుకుందామా…

ఏజెన్సీలో ఏ పండగ అయినా కాస్త డిఫరెంట్. అక్కడి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా సంబరాల్లో మునిగి తేలుతుంటారు గిరిజనులు. హోలీ పండుగ సందర్భంగా.. సాంప్రదాయబద్ధంగా పండుగ చేసుకున్నారు. 60 అడుగుల వరకు కట్టెలు పేర్చి.. దానిపై జెండా పాతి నిప్పు పెట్టారు. కట్టెలు కాలాక ఆ జెండా ఎటువైపు పడితే అటువైపు పాడిపంటలు సమృద్ధిగా పండుతాయి అని విశ్వాసం. పడే జెండా పట్టుకున్న వ్యక్తికి ఊరేగించి సత్కరించడం ఆనవాయితీ.

అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని తాజంగిలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. రాధాకృష్ణ ఆలయంలో హోలీ సందర్భంగా రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనావాయితీ. ఈ సందర్భంగా ఆలయం ఎదుట 70 అడుగుల ఎత్తున హోలీ కర్రలను పేరుస్తామని అన్నారు తాజంగి గ్రామాస్తుడు పురుషోత్తం.

ఇవి కూడా చదవండి

తాజంగి లో వలస వచ్చిన గిరిజనులు

తాజంగి బీటాలైన్‌ లో ఒడిశా నుంచి వలస వచ్చిన ఆదివాసీలు.. హోలీ సంబరాలను సంప్రదాయబద్ధంగా, విభిన్నంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా వారం రోజుల పాటు స్థానికులు శ్రమించి కర్రల పోగును ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలిరోజు సంస్కృతిక కార్యక్రమాలు, మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కర్రల పోగుకు నిప్పుపెట్టారు. తెల్లవారుజామున హోలీ మద్ది కర్రలను కాలుస్తూ వారి సాంప్రదాయాన్ని చాటుకున్నారు. గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఉందని హోలీ అంటే రంగులు ఒకటే పూసుకోవడం కాదని.. సాంప్రదాయం ప్రకారం మద్ది కర్రలతో హోలీ కాలుస్తామని అంటున్నారు గోపాలరావు పూజారి.

దారెలలో జగన్మాధస్వామి..

అలాగే ముంచంగిపుట్టు మండలం 1962 నుంచి దారేలా గ్రామంలో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. దసబ్దాల నుండి హోలీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జగన్నాథ స్వామి ఉత్సవాల్లో ప్రత్యేకంగా హోలీ నిర్వహిస్తారు ఇక్కడ గిరిజనులు. గిరిజన సాంప్రదాయ బద్ధమైన దింసా, ఒరియా నాటకం, చిన్నపిల్లల నృత్యాలు, మ్యాజిక్ షో ల తో సందడి చేశారు.

జెండా ఎటువైపు పడితే..

హోలీ కాల్చడమాంటే.. చలికాలం పోయి వేసవి మొదలైందని ఇక్కడ గిరిజనుల నమ్మకం. పూర్వం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. హోలీ కర్రలలో ఒక జెండా కట్టి.. కాలుతున్న కట్టల్లో ఆ జెండా ఏ దిక్కున పడితే ఆ దిక్కున ఈ ఏడాది గట్టిగా పంటలు పండుతాయి అని ఒక నమ్మకమాంటున్మారు.

వీడియో ఇక్కడ చూడండి..

జెండా పట్టుకున్న వారికి సత్కారం..

అంతేకాదు… కట్టెల మధ్యలో పెట్టిన ఆ జెండా పడిన సమయంలో ఎవరు ఆ జెండాను చేజిక్కించుకుంటే.. వాళ్లను ఊరేగించి సత్కారం చేస్తారు. అలా చేస్తే గ్రామం సుఖశాంతులతోఉంటాయన్నది వాళ్ళ నమ్మకం. ఈ హోలీ వేడుకల్లో గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us