AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ వేళ దారుణం.. రంగులు పూసేందుకు వచ్చిన మనవడిపై అమ్మమ్మ కిరాతకం! ఏం చేసిందంటే..

హోలీ రోజున జరిగింది ఈ దారుణ సంఘటన. అమ్మమ్మ, మనవడి మధ్య సంబంధం అంటే.. ఎప్పుడూ ప్రేమ, అప్యాయతతో కూడిన ప్రత్యేకమైన బంధం. కానీ, హోలీ రోజున ఒక అమ్మమ్మ చేసిన పని అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

హోలీ వేళ దారుణం.. రంగులు పూసేందుకు వచ్చిన మనవడిపై అమ్మమ్మ కిరాతకం! ఏం చేసిందంటే..
Nagpur Woman Pouring Hot Water On Grand Son (1)
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2026 | 1:39 PM

Share

హోలీ అంటేనే ఆనందం, ఆట పాటల పండుగ. కానీ, రంగులు, ఆనందాలకు బదులుగా హోలీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హింస, తగాదాలు, నేర సంఘటనలను తీసుకువచ్చింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియో ప్రతి ఒక్కరినీ షాక్‌ అయ్యేలా చేసింది. హోలీ రోజున జరిగింది ఈ దారుణ సంఘటన. అమ్మమ్మ, మనవడి మధ్య సంబంధం అంటే.. ఎప్పుడూ ప్రేమ, అప్యాయతతో కూడిన ప్రత్యేకమైన బంధం. కానీ, హోలీ రోజున ఒక అమ్మమ్మ చేసిన పని అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన చిన్న పిల్లవాడైన మనవడిపై వేడి వేడి నీళ్లు పోసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో చిన్నారి గాయపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగ్‌పూర్‌లోని ఓ నివాస ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చిన్న గొడవ పెద్ద వివాదంగా మారడంతో కోపానికి లోనైన అవ్వ తన మనవడిపై వేడి నీళ్లు పోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో బాలుడు తీవ్రంగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. గాయపడిన బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలుడికి కాలిన గాయాలు అయినప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, అవసరమైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్స్‌ చెప్పారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బాధిత బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిపై ఇలా దాడి చేయడం చాలా దురదృష్టకరమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రత విషయంలో కుటుంబ సభ్యులు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us