MMTS Services: న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులపై అప్డేట్..
Hyderabad: కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు సందడి నెలకొంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నగర ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్ సర్వీసులకు సంబంధించి రైల్వేశాఖ తీపికబురు అందించింది. డిసెంబర్ 31న అర్థరాత్రి ప్రత్యేక సర్వీసులను నడపనుంది.

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ తెలిపింది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులను నగరంలో నడపనుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా మధ్య ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులు డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచి సేవలు అందించునున్నాయి. నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో డిసెంబర్ 31 అర్థరాత్రి ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే మెట్రో అధికారులు అర్థరాత్రి ఒంటి గంటల వరకు పనివేళలు పొడిగించగా.. ఇప్పుడు ఎంఎంటీఎస్ సేవలు కూడా అర్థరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
టైమింగ్స్ ఇవే..
లింగంపల్లి-ఫలక్‌నుమా స్పెషల్ ఎంఎంటీఎస్ స్పెషల్ రైలు అర్థరాత్రి 1.30 గంటలకు బయల్దేరి ఫలక్ నుమాకు 2.55 గంటలకు చేరుకోనుంది. ఈ రైలు చందానగర్, హాఫీజ్ పేట్, హైటెక్ సిటీ, బోరబండ, భరత్ నగర్, నేచురల్ క్యూర్ హాస్పిటల్, బేగంపేట, సంజీవని పార్క్, జేమ్స్ స్ట్రీట్, సికింద్రాబాద్, విద్యా నగర్, కాచిగూడ, మలక్ పేట, యాకుత్ పూర్ మీదుగా ఫలక్ నుమాకు చేరుకోనుంది.
లింగంపల్లి-హైదరాబద్ స్పెషల్ ఎంఎంటీఎస్ రైలు లింగంపల్లిలో 01.15 గంటలకు బయల్దేరి హైదరాబాద్ స్టేషన్‌కు 01.55కు చేరుకోనుంది. చందానగర్, హఫీజ్ పేట్, హైటెక్ సిటీ, బొరబండ, భరత్ నగర్, ఫతేష్ నగర్, నేచురల్ క్యూర్ హాస్పిటల్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకపూర్ మీదుగా నాంపల్లి స్టేషన్‌కు చేరుకోనుంది. ఈ సేవలను ప్రజలను ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ స్పష్టం చేసింది.
🚉✨️MMTS SPECIAL TRAINS
In view of New Year Celebrations, South Central Railway will run Special MMTS services during the night of 31.12.2025 /01.01.2026@RailMinIndia @SCRailwayIndia #newyear2026 #mmts #specialtrains pic.twitter.com/WbQayS90CB
— South Central Railway (@SCRailwayIndia) December 31, 2025
