AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psych Siddhartha Movie Review: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ.. నందు హిట్టు కొట్టాడా.. ?

హీరోగా నిలదొక్కుకోవడానికి దాదాపు 19 ఏళ్లుగా పోరాడుతున్న నందు.. ఈసారి రొటీన్ కి భిన్నంగా సైక్ సిద్ధార్థతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Gen-Z ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ.. కాస్త ట్రిక్కీ కాన్సెప్ట్‌తో చేసిన ఈ ప్రయోగం న్యూ ఇయర్‌కి ఎలాంటి కిక్ ఇచ్చింది..? ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుంది..? పూర్తి రివ్యూలో చూద్దాం..

Psych Siddhartha Movie Review: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ.. నందు హిట్టు కొట్టాడా.. ?
Psych Siddhartha Movie Revi
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Dec 31, 2025 | 10:26 PM

Share

మూవీ రివ్యూ: సైక్ సిద్ధార్థ

నటీనటులు: శ్రీ నందు, యామిని భాస్కర్, నరసింహ ఎస్, ప్రియాంక రెబెక్కా, సుకేష్ తదితరులు..

సంగీతం: స్మరన్ సాయి

సినిమాటోగ్రఫీ: కె. ప్రకాష్ రెడ్డి

నిర్మాతలు: శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి

దర్శకత్వం: వరుణ్ రెడ్డి

హీరోగా నిలదొక్కుకోవడానికి దాదాపు 19 ఏళ్లుగా పోరాడుతున్న నందు.. ఈసారి రొటీన్ కి భిన్నంగా సైక్ సిద్ధార్థతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Gen-Z ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ.. కాస్త ట్రిక్కీ కాన్సెప్ట్‌తో చేసిన ఈ ప్రయోగం న్యూ ఇయర్‌కి ఎలాంటి కిక్ ఇచ్చింది..? ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుంది..? పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

సిద్ధార్థ (శ్రీ నందు) తన బిజినెస్ పార్ట్నర్స్ అయిన మన్సూర్, తన గర్ల్‌ఫ్రెండ్ త్రిష వల్ల 3 కోట్ల రూపాయలు నష్టపోతాడు. చేతిలో చిల్లీగవ్వ లేక, అద్దెలు కట్టలేక రోడ్డున పడి బస్తీలో తలదాచుకుంటాడు. మోసం చేసిన మన్సూర్ మీద సిద్ధార్థ లీగల్ కేసు వేస్తే.. మన్సూర్ ఫ్రెండ్ రేవంత్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తుంటాడు. మరోవైపు త్రిష ఇటు సిద్ధార్థ, అటు మన్సూర్ మధ్య ఊగిసలాడుతుంటుంది. జీవితం ఇలా వాష్ అవుట్ అయిన టైంలో సిద్ధార్థకు శ్రావ్య (యామిని భాస్కర్) పరిచయం అవుతుంది. భర్త చేతిలో హింస అనుభవిస్తున్న డాన్సర్ ఆమె. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సిద్ధార్థ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? తన సమస్యల సుడిగుండం నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది తెరపై చూడాలి..

కథనం:

ఏ సినిమా తీసుకున్నా కథ అదే ఉంటుంది. కథనంలోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. అలాంటి మ్యాజిక్కే సైక్ సిద్ధార్ధ విషయంలో చేయాలని చూసారు మేకర్స్. ఈ సినిమాని ఒక ట్రిక్కీ మోడ్‌లో నడపాలని ప్లాన్ చేశారు. కానీ రొటీన్ కథ కావడంతో అక్కడక్కడా బోర్ కొడుతుంది. కానీ ఎడిటింగ్ ప్యాట్రన్ కొత్తగా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే విషయం. ఆడియన్స్‌కి అక్కడక్కడా స్లో నెరేషన్ అనిపించినా.. కొత్తగా కూడా అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ నవ్వించినా, అవి చాలా తక్కువ. కథనం కూడా చాలా ప్రెడిక్టబుల్‌గా సాగుతుంది. కానీ సీన్స్ వేటికవే కొత్తగా రాసుకోవడానికి ప్రయత్నించాడు దర్శకుడు వరుణ్ రెడ్డి. సింపుల్ సీన్స్ కూడా తన నటన ప్లస్ ఎడిటింగ్‌తో కొత్తగా మార్చేసాడు నందు. సిద్ధార్థ క్యారెక్టర్ ద్వారా సినిమాను నడిపించాలని చూసినా.. అతనికి సరైన బ్యాక్ స్టోరీ లేకపోవడంతో ఆడియన్స్ ఎమోషనల్‌‌గా అంతగా కనెక్ట్ కాలేకపోయారు. ప్రతీది కామిక్ దారిలోనే చెప్పాలని చూసాడు దర్శకుడు. లైఫ్ ని ఒక గేమ్ లా చూసే సిద్ధార్థ మెంటాలిటీని, అతని బ్రెయిన్‌లో జరిగే సంఘర్షణను చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడు. కానీ ఆ కాన్సెప్ట్ కు తగ్గ డెప్త్ రైటింగ్‌లో కూడా ఉండుంటే సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉండేది. కొత్తగా, కూల్ గా చూపించాలనే తాపత్రయం కనిపించింది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ పర్లేదు.. ఎమోషనల్‌గానూ బాగానే ఉంది. సైక్ సిద్ధార్థ ఒక ప్రయోగాత్మక చిత్రం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ‘New-Age’ మేకింగ్‌తో తీసిన సినిమా ఇది. నందు నటన, కొన్ని క్రేజీ మూమెంట్స్ బాగున్నాయి. అయితే లోతైన కథనం లేకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం మైనస్. ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్‌కు.. మరీ ముఖ్యంగా ప్రయోగాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చొచ్చు.

నటీనటులు:

శ్రీనందు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. తన ఇమేజ్ చట్రాలన్నీ బ్రేక్ చేశాడనే చెప్పాలి. అమాయకంగా కనిపిస్తూనే, డేంజరస్‌గా ప్రవర్తించే పాత్రలో జీవించాడు. పాత్ర డిమాండ్ మేరకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా 100% ఎఫర్ట్ పెట్టాడు. యామిని భాస్కర్ కూడా శ్రావ్య పాత్రలో చాలా క్యూట్‌గా కనిపించింది. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లీడ్ పెయిర్ మనిహాయిస్తే మిగిలిన నటీనటులు ఎవరూ ఆడియన్స్‌కు పెద్దగా ఐడియా లేదు. అయినా కూడా హీరో ఫ్రెండ్ పాత్రలో ఒకటి బాగా పేలింది. తమ పాత్రల్లో అంతగా ఒదిగిపోలేకపోయారు. చాలా సన్నివేశాల్లో వాళ్ల నటన కృత్రిమంగా అనిపిస్తుంది.

టెక్నికల్ టీం:

స్మరన్ సాయి సంగీతం డిఫెరెంట్‌గా ఉంది.. అలాగే ఎడిటింగ్ కూడా కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ పర్లేదు. దర్శకుడు వరుణ్ రెడ్డి రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్‌గా ఉండుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సైక్ సిద్ధార్థ.. కొంచె సైక్ కానీ.. డిఫెరెంట్ అటెంప్ట్..!