AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Mutton Kurma Recipe: మటన్ కొంటున్నారా?.. నెల్లూరు స్టైల్‌లో ఈ గ్రేవీ వండకపోతే మీరు పక్కా లోకల్ రుచిని మిస్ అయినట్లే!

ఆదివారం వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లో మాంసాహార ఘుమఘుమలు ఉండాల్సిందే. చికెన్, చేపలు ఎలా ఉన్నా మటన్ ముక్క పడకపోతే చాలామందికి ముద్ద దిగదు. అయితే ఎప్పుడూ చేసే రొటీన్ గ్రేవీ కాకుండా, ఈసారి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా స్పెషల్ మటన్ కుర్మాను ట్రై చేయండి. ఘాటైన మసాలాలు, నోరూరించే గ్రేవీతో ఉండే ఈ వంటకం ఇడ్లీ, దోస, చపాతీ లేదా అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. ఈ నెల్లూరు స్టైల్ రెసిపీ ఇప్పుడు మీకోసం..

Nellore Mutton Kurma Recipe: మటన్ కొంటున్నారా?.. నెల్లూరు స్టైల్‌లో ఈ గ్రేవీ వండకపోతే మీరు పక్కా లోకల్ రుచిని మిస్ అయినట్లే!
Nellore Mutton Kurma Recipe
Bhavani
|

Updated on: Mar 10, 2026 | 2:39 PM

Share

ఆంధ్రా వంటకాలు అంటేనే కారం, మసాలాలకు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా నెల్లూరు మటన్ కుర్మా రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇందులో మటన్‌ను పెరుగు, మసాలాల్లో మారినేట్ వల్ల ముక్కలు చాలా మృదువుగా తయారవుతాయి. గంటల కొద్దీ శ్రమ లేకుండా, పక్కా కొలతలతో ఈ స్పైసీ మటన్ గ్రేవీని ఎలా సిద్ధం చేయాలో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

మటన్: 1 కిలో

మ్యారినేషన్ కోసం: 1 1/4 కప్పుల పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ (3 స్పూన్లు), 1 1/2 చెంచా కారం, 1 చెంచా పసుపు.

తాలింపు కోసం: 4 చెంచాల నూనె, 3 తరిగిన పెద్ద ఉల్లిపాయలు, 5 లవంగాలు, 8 ఏలకులు, 4 తరిగిన టమోటాలు.

ఫినిషింగ్ కోసం: జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం (2 స్పూన్లు), మిగిలిన కారం, ఉప్పు.

తయారీ విధానం:

ఒక గిన్నెలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసి బాగా కలపాలి. ఇందులో శుభ్రం చేసిన మటన్ ముక్కలను వేసి బాగా కలిపి, కనీసం 2 గంటలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. దీనివల్ల మటన్ మృదువుగా ఉడుకుతుంది.

ఒక పాన్ లో నూనె పోసి వేడి చేసి, తరిగిన ఉల్లిపాయలు వేసి అవి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత ఏలకులు, లవంగాలు వేసి కలపాలి.

నానబెట్టిన మటన్ ముక్కలను ఇందులో వేసి, తక్కువ మంట మీద సుమారు 20 నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించాలి.

ఇప్పుడు తరిగిన టమోటాలు, కరివేపాకు వేసి టమోటాలు మెత్తబడే వరకు వేయించాలి.

సుమారు 6 కప్పుల నీళ్లు పోసి, మిగిలిన కారం పొడి వేసి మరిగించాలి. మటన్ మెత్తగా అయ్యే వరకు మీడియం మంట మీద 1 గంట పాటు ఉడికించాలి.

గ్రేవీ చిక్కబడ్డాక నిమ్మరసం, సరిపడా ఉప్పు కలపాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి నెల్లూరు మటన్ కుర్మా సిద్ధం!

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం