కోలీవుడ్‌లో స్టార్ వారసుల సందడి
కోలీవుడ్‌లో వారసుల హవా మొదలైంది. ధనుష్ కుమారుడు యాత్ర హీరోగా, విజయ్ తనయుడు సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతుండగా, విక్రమ్ తనయుడు ధృవ్ ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్నారు. సూర్య కుమార్తె, విజయ్ సేతుపతి తనయుడు కూడా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. త్వరలోనే వెండితెరపై ఈ స్టార్ వారసుల సందడి చూడొచ్చు.
అన్ని సినీ పరిశ్రమల్లో వారసుల సందడి పెరిగిపోతోంది. బాలీవుడ్, టాలీవుడ్ తర్వాత ఇప్పుడు కోలీవుడ్ కూడా ఈ జాబితాలో చేరింది. తమిళ సినీ రంగంలో ప్రముఖ తారల వారసులు వెండితెరపై తమ సత్తా చాటుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొంతమంది స్టార్ కిడ్స్ ఇప్పటికే అరంగేట్రం చేయగా, మరికొందరు త్వరలోనే తెరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన కుమారుడు యాత్రను హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వివిధ సినీ కార్యక్రమాలలో కనిపిస్తున్న యాత్ర, త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్నాడు. ధనుష్ దర్శకత్వంలోనే యాత్ర హీరోగా పరిచయం కావడం విశేషం. దళపతి విజయ్ తనయుడు సంజయ్ సైతం సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అయితే సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న సిగ్మా చిత్రంతో సంజయ్ మెగాఫోన్ పట్టనున్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
మాయమైపోతున్న మాన్‌సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!

