పుంగనూరు గిత్తా మజాకా.. హైట్ తక్కువైనా..ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న పుంగనూరు జాతి గిత్తకు కోనసీమలో భారీ ధర పలికింది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ డెయిరీ ఫామ్‌లో పెంచుతున్న అరుదైన గిత్తను చెన్నైకి చెందిన డెయిరీ ప్రతినిధులు రూ.3.75 లక్షలకు కొనుగోలు చేశారు. మూడున్నరేళ్ల వయసున్న ఈ గిత్త 34 అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయంగా ఉండటంతో, పుంగనూరు సంతతి అభివృద్ధి కోసం చెన్నైకి తరలించారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుంగనూరు ఆవులకు, గిత్తలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒంగోలు గిత్త తర్వాత అంతటి క్రేజ్ వీటి సొంతం. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అరుదైన జాతి పశువులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒక పుంగనూరు గిత్త భారీ ధరకు అమ్ముడై సరికొత్త రికార్డ్ సృష్టించింది. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఆయన తన ఫారంలో ఎంతో అరుదైన పుంగనూరు జాతి గిత్తను అపురూపంగా పెంచుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, డెయిరీ సర్వీసెస్ ప్రతినిధులు ఈ గిత్తపై కన్నేశారు. చెన్నైలో పుంగనూరు జాతి సంతతిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు నేరుగా అంబాజీపేటలోని మాచవరానికి వచ్చారు. ప్రేమ్ కుమార్ వద్ద ఉన్న ఆ గిత్తను పరిశీలించి, దాని ధరను రూ.3.75 లక్షలుగా నిర్ణయించి కొనుగోలు చేశారు. ఈ గిత్త కేవలం మూడున్నర సంవత్సరాల వయసు కలిగి ఉండి, సరిగ్గా 34 అంగుళాల ఎత్తుతో చాలా ఆకర్షణీయంగా ఉంది. పొట్టిగా, చూడముచ్చటగా ఉండే ఈ పుంగనూరు గిత్తను చెన్నైకి తరలించారు. అరె.. గిత్త పొట్టిదేకానీ.. ధరలో మాత్రం మహా గట్టది సుమా..అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు!
అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

