జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు
కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం 10 రోజులుగా మిస్టరీగా కొనసాగుతోంది. వందలాది మంది పోలీసులు, NDRF, SDRF బృందాలు అత్యాధునిక డ్రోన్లు, థర్మల్ డ్రోన్లతో అడవిని జల్లెడ పడుతున్నా చిన్నారి ఆచూకీ దొరకలేదు. పెంపుడు శునకం అనుమానాస్పదంగా మృతి చెందడం, కొండచిలువ చిన్నారిని మింగి ఉండవచ్చన్న కోణం కేసులో మరింత సంక్లిష్టతను పెంచింది.
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దర్యాప్తు పురోగతిని సమీక్షించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎవరూ తీసుకెళ్లలేదని, అడవి జంతువులు లాక్కెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాప అదృశ్యమైన రోజు కురిసిన భారీ వర్షం కారణంగా కొట్టుకుపోయి ఉండవచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో కీలకమైన పెంపుడు కుక్క పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు, తెలంగాణకు చెందిన జ్ఞాని తిమ్మప్ప చిన్నారి అర్ధరాత్రి క్షేమంగా తిరిగి వస్తుందని, దేవతామూర్తులే ఆమెను వదిలి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు మాత్రం శాస్త్రీయ దర్యాప్తు ద్వారానే ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

