అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కూలిపోయింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది విమాన సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రొటీన్ టెస్ట్ మిషన్‌లో భాగంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
అమెరికా వైమానిక దళంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అనే భారీ వ్యూహాత్మక బాంబర్ విమానం కుప్పకూలింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది విమాన సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 2016 తర్వాత ఈ తరహా బాంబర్ విమానానికి జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదే కావడం గమనార్హం. అధికారుల కథనం ప్రకారం, దక్షిణ కాలిఫోర్నియాలోని మోజావే ఎడారిలో ఉన్న ఈ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది. రొటీన్ టెస్ట్ మిషన్‌లో భాగంగా టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానం అదుపుతప్పి రన్‌వేకు 300 గజాల దూరంలో తీవ్ర వేగంతో నేలను ఢీకొని ధ్వంసమైంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

