AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనబడుట లేదు..వాళ్ళకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్..!

కనబడుట లేదు..వాళ్ళకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్..!

Samatha J
|

Updated on: Jun 18, 2026 | 7:07 PM

Share

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు చక్రం తిప్పిన స్టార్ హీరోయిన్ల జోరు ప్రస్తుతం తగ్గిపోయింది. శ్రీలీల, సాయి పల్లవి, తమన్నా, అనుష్క శెట్టి వంటి అగ్రతారలు ఇప్పుడు తెలుగు తెరపై అంతగా కనిపించడం లేదు. వీరి కెరీర్‌కు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవకాశాలు రావట్లేదా? వచ్చినా కూడా వద్దనుకుంటున్నారా? లేదంటే ఇతర పరిశ్రమలపై దృష్టి సారించారా?

 

 

రెండేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలిన శ్రీలీల ఇటీవల కొన్ని ఫ్లాపుల కారణంగా జోరు తగ్గించుకుంది. పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” తర్వాత ఆమె తెలుగులో అస్సలు కనిపించడం లేదు. ప్రస్తుతం తమిళంలో ధనుష్ సినిమాలో నటిస్తోంది. చదువు కోసమే శ్రీలీల గ్యాప్ తీసుకుందని ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి కూడా “తండేల్” తర్వాత తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఆమె దృష్టి ఇప్పుడు బాలీవుడ్‌పైనే ఉంది. రామాయణంలో సీతగా నటిస్తున్న సాయి పల్లవిని తెలుగులో చూడడం కష్టమే అనిపిస్తోంది. అలాగే ఒకప్పుడు స్టార్ హీరోలందరినీ చుట్టేసిన తమన్నాకు ఇప్పుడు ఆఫర్లు కరువయ్యాయి. అడపాదడపా స్పెషల్ సాంగ్స్ మినహా హీరోయిన్ పాత్రలు రావట్లేదు. ఆమె ఫోకస్ ఇప్పుడు వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్ సినిమాలపై ఉంది. అనుష్క శెట్టి కెరీర్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. భారీ గ్యాప్ తర్వాత చేసిన “ఘాటి” డిజాస్టర్ అవ్వడంతో, ఆమె చేతిలో మలయాళ సినిమా “కతనార్” తప్ప మరోటి లేదు. మొత్తానికి ఒకప్పుడు ప్రేక్షకులను రఫ్ఫాడించిన ఈ బ్యూటీలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

మరిన్ని వీడియోల కోసం :

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

మాయమైపోతున్న మాన్‌సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్

బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు

 

Follow Us