పవన్ కల్యాణ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడిని హనుమకొండలో పరామర్శించారు. చిన్నారి కోరిక మేరకు ఇంటికి వెళ్లి, లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి బతుకుదెరువుగా క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటన అభిమానుల్లో ఆనందం నింపింది.