AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పోర్టల్, SMS పనిచేయడం లేదా?..టెన్షనొద్దు.. ఇలా సింపుల్‌గా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి!

EPFO balance check alternative ways: చాలా మంది ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఎస్ఎంఎస్ (SMS), మిస్డ్‌ కాల్స్ లేదా ఈపీఎఫ్ఓ (EPFO) పోర్టల్‌పై ఆధారపడుతుంటారు. కానీ కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యలు, మొబైల్ నంబర్ మ్యాచ్ కాకపోవడం లేదా ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ అవ్వడం వల్ల ఎస్ఎంఎస్ లేదా మిస్డ్‌ కాల్ సర్వీసులు పని చేయవు. అలాంటి సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలో ఇక్కడ స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jun 19, 2026 | 8:51 AM

Share
ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్: మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేయడానికి ఈపీఎఫ్ఓ  https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి అక్కడ మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్, వచ్చిన వడ్డీ, కంపెనీ జమ చేసిన మొత్తాన్ని చూడటానికి ‘View Passbook’ సెక్షన్‌కి వెళ్లండి. అక్కడ మీ పీఎఫ్‌ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందని ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్య గమనికా.. మీ UAN యాక్టివేట్ కాకపోతే, మొదట మీ పీఎఫ్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా దాన్ని యాక్టివేట్ చేయాలి. కొన్నిసార్లు పోర్టల్ మెయింటెనెన్స్ లేదా సాంకేతిక సమస్యల వల్ల లాగిన్ అవ్వడం కుదరకపోవచ్చు.

1 / 5
ఎస్ఎంఎస్ (SMS), మిస్డ్‌ కాల్ ద్వారా బ్యాలెన్స్ చెకిండి: మీరు లాగిన్ అవ్వకుండానే మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 కి మెసేజ్ పంపండి. మీకు ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. అలా కాకపోతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 కి మిస్డ్‌ కాల్ ఇవ్వండి. కాసేపటికే మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలతో కూడిన మెసేజ్ వస్తుంది. అయితే మీ మొబైల్ నంబర్ ఈపీఎఫ్ఓతో అప్‌డేట్ కాకపోయినా లేదా నెట్‌వర్క్ సిగ్నల్ సరిగ్గా లేకపోయినా ఇవి పని చేయవు.

2 / 5
ఈ 3 పద్దతులు పనిచేయకపోతే: ఈ 3 పద్దతులు పనిచేయకపోతే మీరు ఉమాంగ్ యాప్‌ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు యాప్ డౌన్‌లోడ్ చేసి మీ UAN నంబర్‌ను రిజిస్టర్ చేసుకుని, వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోండి. మరో పద్దతి వాట్సాప్ సర్సీస్.. వాట్సాప్ పీఎప్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు మీ UAN నంబర్‌ను 7738299899 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపి కూడా మీ పీఎఫ్ వివరాలను పొందవచ్చు.

3 / 5
ఆఫ్‌లైన్‌లో బ్యాలెన్స్ చెకింగ్: మీరు ఆఫ్‌లైన్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే.. మీ దగ్గరలోని ఈపీఎఫ్ఓ ఆఫీస్‌కు వెళ్లి, మీ UAN నెంబర్, ఐడీ ప్రూఫ్ సమర్పించి మీ పీఎఫ్ స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు. మరో ఆప్షన్ ఏమిటంటే.. మీ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించి, మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ వివరాలను లేదా పాస్‌బుక్ స్టేట్‌మెంట్ ప్రింట్‌ను అడిగి తీసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా మొబైల్ సర్వీసెస్ నిరంతరం సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఆఫ్‌లైన్ పద్ధతులు బాగా హెల్ప్ అవుతాయి.

4 / 5
మీరు ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ఒకటి మీ మొబైల్ నంబర్ మీ UAN తో లింక్ అయ్యి ఉండేలా చూసుకోండి. అలాగే పోర్టల్ లాగిన్ కోసం మీ UAN, పాస్‌వర్డ్‌ను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి. బ్యాకప్ ఆప్షన్లుగా ఉమాంగ్ యాప్ లేదా వాట్సాప్ సర్వీస్‌ను యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వివరాల తప్పుల వల్ల వచ్చే సమస్యలను నివారించడానికి మీ వ్యక్తిగత వివరాలను మీ కంపెనీ రికార్డులలో అప్‌డేట్‌గా ఉంచండి.

5 / 5
Follow Us