ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు.. పిచ్చిపిచ్చిగా తిట్టి, కొట్టి చాలా హింసించారు
జబర్దస్త్ కమెడియన్ తన్మయి గతంలో ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని పలు సంచలన విషయాలను తెలిపింది. తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన తీవ్రమైన కష్టాలను ఆమె వివరించింది. తాను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన యాక్సిడెంట్, తలకు సర్జరీ, కోమాలోకి వెళ్లే పరిస్థితిని పంచుకున్నారు.

జబర్దస్త్ కమెడియన్ తన్మయి తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. జబర్దస్త్ షోలో లేడీ గెటప్‌తో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా ఎపిసోడ్లో తన్మయి తన కామెడీతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం పలు షోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాల గురించి పంచుకున్నారు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ఎదుర్కొన్న కష్టాలు, నమ్మకద్రోహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇండస్ట్రీలో వేధింపులు వంటి అనేక విషయాలను ఆమె నిర్మొహమాటంగా పంచుకున్నారు. తనకు ఒకసారి తీవ్రమైన యాక్సిడెంట్ జరిగిందని, దాని వల్ల తల సర్జరీ అయ్యిందని, రైనోప్లాస్టీ చేయించుకున్నానని తన్మయి తెలిపింది. ఈ ప్రమాదంలో కోమాలోకి వెళ్లే పరిస్థితి కూడా ఏర్పడిందని, ఆ సమయంలో తనను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం బ్రతికి ఉన్నానా.. చనిపోయానా.. అని కూడా ఎవరూ అడగలేదని అన్నారు.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్
తండ్రి మరణం తనకు తీరని లోటు అని, ఆయన చనిపోయిన రోజు రాత్రి వీడియో కాల్‌లో మాట్లాడారని, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఆయన మరణ వార్త తెలిసి షాక్ అయ్యానని తన్మయి చెప్పారు. ఆ కష్టకాలంలో జబర్దస్త్ టీమ్‌లో ఎవరూ తన పక్కన నిలబడలేదని, కేవలం నూకరాజు ఒక్కడే తన షూటింగ్‌ను వదిలిపెట్టి, కార్ తీసుకొని వచ్చి, తన తండ్రి దగ్గరకు చేరే వరకు తన చేయి పట్టుకొని ఓదార్చాడని తెలిపింది. మిగతా వారెవరూ తనకు సహాయం చేయలేదని, ఆర్థికంగా కూడా ఎవరూ ఆదుకోలేదని ఆమె అన్నారు. అలాగే జబర్దస్త్ నటులలో కొందరు తనను మోసం చేశారని, ముఖ్యంగా కిరాక్ ఆర్పీ తన పట్ల నమ్మకద్రోహం చేశాడని తన్మయి చెప్పుకొచ్చింది. ఆర్పీని తన సొంత అన్నలా భావించానని, ఆర్థికంగా కూడా చాలా సహాయం చేశానని, అయితే తనకు కష్టం వచ్చినప్పుడు ఆర్పీ పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి : మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు
నమ్మకం, డబ్బు ఈ రోజుల్లో ఎంత పాపిష్టివో అని ఎమోషనల్ అయ్యింది తన్మయి. ఆర్పీ వల్లే తాను ‘అదిరింది’ టీమ్‌లో చేరానని, అయితే తనకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నావని కూడా అడగలేదని చెప్పింది. కిరాక్ ఆర్పీ తనను మోసం చేయడం కూడా జబర్దస్త్ నుండి బయటకు రావడానికి ఒక కారణం అని తన్మయి పేర్కొంది. వ్యక్తిగత జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తనను ఇప్పటికీ వెంటాడుతున్నాయని తన్మయి తెలిపింది. సంపాదించినదంతా కుటుంబం కోసమే ఖర్చు పెట్టానని, తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదని తెలిపింది. తన కుటుంబం అంతా గుంటూరులో ఉంటారని, తాను ఒక్కదానినే హైదరాబాద్‌లో ఉంటానని చెప్పుకొచ్చింది.ఇండస్ట్రీలో పెద్ద హోదాలో ఉన్న కొందరు వ్యక్తులు తనను వేధించారని, శారీరకంగా, మానసికంగా హింసించారని తన్మయి సంచలన ఆరోపణలు చేసింది.. తన తండ్రి ఆరోగ్యం సరిగా లేని సమయంలో, చేతిలో రూపాయి కూడా లేని స్థితిలో, సహాయం చేస్తామని చెప్పిన కొందరు ఇండస్ట్రీ వ్యక్తులు తనను కొట్టారని, తిట్టారని, ఫోన్‌లో హరాస్ చేశారని వెల్లడించారు. ఈ భయంతోనే రెండేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని చెప్పారు.
ఇది కూడా చదవండి :అంత అందమైన బ్యూటీని ఇలా మార్చేశారేంట్రా బాబు..!! ఈ అందాల తారను గుర్తుపట్టారా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




