AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు

 రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు రెండు డిఫరెంట్ పాత్రల్లో లో కనిపించనున్నారు.

మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు
Rrr Movie
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2026 | 11:39 AM

Share

రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు బ్రహ్మాండమైన విజయాలను కూడా అందుకుంటుంటాయి. రాజమౌళి చేసిన సినిమాలన్నీ సంచలన విజయాలను అందుకున్నాయి. వివిధ జోనర్స్ లో సినిమాలు తెరకెక్కించి హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఆతర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. బిగెస్ట్ మల్టీస్టారర్ మూవీగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. అద్భుతమైన కథతో ఇద్దరు హీరోలను ఎక్కడా తగ్గకుండా బ్యాలెన్స్డ్ గా చూపించారు రాజమౌళి.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ వేదికపై సందడి చేసిన విషయం తెలిసిందే.. హాలీవుడ్ దర్శకులు కూడా మన సినిమా చూసి తెగ మెచ్చుకున్నారు. దర్శకుడు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు హాలీవుడ్ దిగ్గజాలు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. అలాగే ఈ సినిమాలో మల్లి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గోండు పిల్లగా నటించిన మల్లీ పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుంది. ఆ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా.? ఆ చిన్నారి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?

సినిమా మొదలవడంతోనే కొమ్మ ఉయ్యాలా అంటూ పాట పాడుతూ ప్రేక్షకుల అలరించింది ఆ చిన్నారి.  అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుందో తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ ను తెగ గాలిస్తున్నారు. ఆమె పేరు ట్వింకిల్ శర్మ. ఈ చిన్నది చాలా ఫేమస్ .  డాన్స్ ఇండియా షో ద్వారా పాపులర్ అయ్యింది ట్వింకిల్ శర్మ.. ఈ చిన్నాది చాలా టీవీ షోల్లో కనిపించి అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే ఎన్నో డాన్స్ షోలు కూడా చేసింది. వీటితో పాటు ఫ్లిప్ కార్డ్ యాడ్‌లోనూ కనిపించింది. ఇక ఆర్ఆర్ ఆర్ సినిమాలో అవకాశం అందుకొని బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆర్ఆర్ఆర్ మొదలైనప్పుడు ఆమె ఎనిమిదో తరగతి చదువుతుందట.. సినిమా పూర్తయ్యే సమయానికి ఇంటర్ పూర్తయ్యింది. 2022లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యినాలుగేళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

ట్వింకిల్ శర్మ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ 

View this post on Instagram

A post shared by t⭐️ (@_twinklesharmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us