AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

ప్రముఖ నటి సమంత ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఉమెన్ సెంట్రిక్ సినిమాల ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు .

ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్
Samantha
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2026 | 12:25 PM

Share

స్టార్ హీరోయిన్ సమంత తిరిగి సినిమాల్లో ఫుల్ బిజీ కానున్నారు. నటిగా రాణిస్తూనే నిర్మాతగానూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు సమంత. ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 19న విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ సామ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. వీలైనంత ఎక్కువుగానే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు సమంత. తాజాగా తమిళనాడు సీఎం విజయ్ ను కూడా కలిసింది సమంత. విజయ్ సమంత కలిసి కత్తి, పోలీసోడు, అదిరింది సినిమాల్లో నటించారు. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

ఇదిలా ఉంటే తాజాగా సమంత రెబల్ స్టార్ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ఒకప్పుడు ఉమెన్ సెంట్రిక్ జోనర్ సినిమాలు అంటే ఒకే జానర్‌లో మాత్రమే ఉండేవని, వాటిలో ఆడవాళ్లు ఏంజెల్లా ఉండాలని, మంచితనం, త్యాగం, సున్నితమైన లక్షణాలను కలిగి ఉండాలని ఓ నియమం ఉండేదని సమంత అన్నారు. అలాంటి పాత్రల ద్వారా కేవలం సామాజిక సందేశాలు మాత్రమే వచ్చేవని, అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోందని, మహిళలు యాక్షన్ సినిమాలకు కూడా సిద్ధమవుతున్నారని సమంత చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కూడా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను చేయగల సత్తా ఉందని సామ్ తెలిపింది. ఈ విషయంలో ఆమె స్టార్ హీరో ప్రభాస్‌ను ఉదాహరణగా చూపించింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?

“ప్రభాస్ చేయి పెడితే చాలు.. 100 కోట్లు వస్తాయి” అని అంటూనే, ప్రభాస్ మొదటి సినిమా నుండే ఈ స్థాయికి రాలేదని, దాదాపు పదేళ్ల పాటు దర్శకులు, రచయితలు నిరంతరం కృషి చేసి, ఆయన్ను ఈ స్థాయికి ఎలివేట్ చేశారని, ఆయన చేతిపెడితే జనం చచ్చిపోతారనేంత స్టార్‌డమ్‌ను నిర్మించారని సమంత చెప్పుకొచ్చింది. అదేవిధంగా, హీరోయిన్స్ కూడా ఈ ప్యాడింగ్ నిరంతరం అందిస్తే, వారు కూడా మెల్లిమెల్లిగా ఒక స్థాయికి చేరుకోగలరని సమంత తెలిపింది. మొదటి సినిమాలో తాము చేతి పెడితే ప్రేక్షకులు కొట్టవచ్చని, కానీ నిరంతరం ప్రయత్నం చేసి, మద్దతు అందిస్తే లేడీ యాక్టర్స్ కూడా భారీ విజయాలు సాధిస్తారని సమంత పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

Prabhas

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us