ధర్మస్థల వివాదంలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. 200 కోట్ల కుట్రలో తన ప్రమేయం ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. చిన్నయ్య అనే వ్యక్తి చేసిన ఆరోపణలను సిట్ చీఫ్ మహంతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వివాదం కోర్టు పరిధిలో ఉందని, తనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.