AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు.. ఫొటోస్ ఇదిగో

హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఇంట్లో తాజాగా శుభకార్యం జరిగింది. ఆమె అక్క కూతురి సీమంతం రీసెంట్‌గా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

Basha Shek
|

Updated on: Jun 18, 2026 | 10:44 PM

Share
  హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ యాక్టర్స్ మంజుల, విజయ్ కుమార్ ల ముద్దుల కూతురైన ఆమె ప్రభాస్ పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది

1 / 6
 దీని తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది శ్రీదేవి. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 / 6
 నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మి, పెళ్లి కాని ప్రసాద్, మంజీర, సెల్‌ ఫోన్, వీర తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా చేసింది శ్రీదేవి విజయ్ కుమార్.

3 / 6
 మధ్యలో పెళ్లి, పిల్లల కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతేడాది నారా రోహిత్ సుందరకాండ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది నాగశౌర్య హీరోగా నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించింది శ్రీదేవి.

4 / 6
  కాగా రీసెంట్ గా శ్రీదేవి ఇంట్లో శుభాకార్యం జరిగింది. ఆమె అక్క కూతురు త్వరలోనే తల్లి కానుంది. దీంతో ఆమెకు గ్రాండ్ గా సీమంతం నిర్వహించారు. ఈ వేడుకలో శ్రీదేవి కుటుంబ సభ్యులందరూ సందడి చేశారు.

5 / 6
 శ్రీదేవి తండ్రి విజయ్ కుమార్, అలాగే ఆమె అక్క ప్రీతా విజయ్ కుమార్ లు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి.

6 / 6
Follow Us