న్యూ ఇయర్ వేడుకలతో మద్యం అమ్మకాల్లో జోరు
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో రూ.5000 కోట్లు దాటాయి. ప్రభుత్వం దుకాణాలకు, ఈవెంట్లకు వేళలు పొడిగించగా, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు కఠినతరం చేశారు. మద్యం సేవించిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసి మద్యం దుకాణాలకు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్‌లకు ఒంటిగంట వరకు అనుమతించింది. నిన్న, ఇవ్వాళ కలిపి సుమారు 600 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఈసారి మద్యం అమ్మకాలు 5,000 కోట్లు దాటాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సాధారణంగా నెలకు 3,500 నుండి 4,000 కోట్ల మధ్య ఉండే అమ్మకాలు ఈసారి అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్
దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

