తారక్ vs ధనుష్.. మురుగన్ యుద్ధానికి తెరలేపిన రెండు ఇండస్ట్రీలు!
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ ప్రకటనతో మొదలైన మురుగన్ వివాదం ఇప్పుడు టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ చర్చగా మారింది. తమిళుల అభ్యంతరాల మధ్య ధనుష్, వెట్రిమారన్ 'తమిళ్ మురుగన్' చిత్రాన్ని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. ఈ రెండు సినిమాల మధ్య పోలికలు తప్పవన్న చర్చ సాగుతుండగా, ముందుగా ఏ సినిమా విడుదలవుతుందన్న ఆసక్తి కూడా పెరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ప్రకటన సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ముఖ్యంగా తమిళనాట ఈ సినిమాపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ డిస్కషన్ కంటిన్యూ అవుతుండగానే ధనుష్, వెట్రిమారన్ కూడా మురుగన్ కాన్సెప్ట్‌తో సినిమాను ప్రకటించారు. దీంతో ఇప్పుడీ వివాదం టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్‌గా మారింది. అసలు ఈ మురుగన్ వివాదం ఏంటి? డిటైల్ట్‌గా చూద్దాం. తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎపిక్ మూవీకి సంబంధించిన ప్రకటన నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో కోలీవుడ్‌లో వివాదం మొదలైంది. పోస్టర్‌లో సంస్కృత శ్లోకం ఉండటం, కుమారస్వామి ఉత్తరాదిన జన్మించాడని ప్రచారం జరగడంతో మురుగన్ మా దేవుడు అంటూ తమిళ తంబీలు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. సరిగ్గా ఈ వేడిలోనే తమిళ హీరో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో ‘తమిళ్ మురుగన్’ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ కావడం మరింత కాక రేపుతోంది. ఎన్టీఆర్ సినిమాకు పోటీగానే తమ దేవుడి చరిత్రను వక్రీకరించకుండా మేమే తీస్తామంటూ తమిళ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను హడావుడిగా అనౌన్స్ చేశారా అనే డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. కేవలం ఏఐ విజువల్స్‌తో రిలీజ్ చేసిన తమిళ మురుగన్ టీజర్ మీద టాలీవుడ్ ఆడియన్స్ నుంచి సెటైర్స్ పడుతున్నాయి. కమ్యూనిస్ట్ భావాలున్న దర్శకుడు వెట్రిమారన్, ఫస్ట్ టైమ్ డివోషనల్ కథను ఎంచుకోవటంతో ఆ సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా ఓ నవల ఆధారంగానే ప్లాన్ చేస్తున్నారు వెట్రిమారన్. ధనుష్ వేగంగా సినిమా పూర్తి చేశాస్తారు కాబట్టి, తారక్ సినిమా కన్నా ముందే తమిళ మురుగన్ ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో కచ్చితంగా పోలికలు వస్తాయనే టెన్షన్ నెలకొంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ మూవీ పూర్తయ్యేలోపు త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. తారక్ ఇమేజ్ త్రివిక్రమ్ విజన్, సినిమా స్కేల్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ముందు ధనుష్ మురుగన్ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఏ మురుగన్ ఆడియన్స్‌ను మెప్పిస్తాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్ ఖాతాలోకి వచ్చింది!
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం

