AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: ఈ ఫీచర్ ఉంటే అన్ని భాషలూ వచ్చినట్టే.. వాట్సాప్ యూజర్లకు పండగే..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక కోట్ల మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. వాట్సాప్ యాజమాన్యం కూడా నిత్యం అప్ డేట్లు చేస్తూ యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందజేస్తోంది. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్ ను పరీక్షిస్తోంది. దీని ద్వారా ఆండ్రాయిడ్ యూజర్ల యాప్ లోనే చాట్ మెసేజ్ లను నేరుగా అనువాదం చేసుకోవచ్చు. వేరే భాషలో వచ్చిన చాట్ లను సొంత భాషలో చదువుకోవడానికి దీని ద్వారా వీలు కలుగుతుంది.

Whatsapp: ఈ ఫీచర్ ఉంటే అన్ని భాషలూ వచ్చినట్టే.. వాట్సాప్ యూజర్లకు పండగే..!
Nikhil
|

Updated on: Apr 22, 2025 | 5:30 PM

Share

వాట్సాప్ ఆండ్రాయిట్ బీటా వెర్షన్ 2.25.12.25లో కొత్త ట్రాన్స్ లేషన్ సెట్టింగ్స్ లో ఈ ఫీచర్ ఉంది. ప్రస్తుతం కొందరు బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. రానున్న కొద్ది వారాల్లో బీటా చానల్ కు వస్తుంది. యూజర్లందరికీ అందించే విషయంపై స్పష్టత లేదు. దీని అనువాదాలన్నీ మీ ఫోన్ లోనే జరుగుతాయి. బయటి సర్వర్లకు డేటా వెళ్లే అవకాశమే ఉండదు. యూజర్లు ఈ ఫీచర్ ద్వారా హిందీ, అరబిక్, రష్యన్, బ్రెజిలియన్, పోర్చుగీసు వంటి వాటిలో ఒక భాషను ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత వాట్సాప్ మీ ఫోన్ కు భాషా ప్యాక్ ను డౌన్ లోడ్ చేస్తుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే వివిధ భాషల్లో వచ్చిన సందేశాలను అనువదిస్తుంది. వినియోగదారులు చాట్ లోని అన్ని సందేశాలను ఆటోమేటిక్ గా అనువాదం చేసుకోవచ్చు. లేకపోతే నిర్దిష్ట సందేశాలను నొక్కి, మాన్యువల్ గా కూడా చేసుకోవచ్చు.

అనువాదాలన్ని ఫోన్ లోనే జరుగుతాయని కాబట్టి గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. యూజర్లు యాప్ నిల్వ సెట్టింగుల ద్వారా డౌన్ లోడ్ చేసిన భాషా ప్యాక్ లను తొలగించుకోవచ్చు. స్థలం తక్కువ ఉంటే అనవసర భాషలను డిలీట్ చేయవచ్చు. దీని ద్వారా యూజర్లు వివిధ భాషలలో షేర్డ్ కంటెంట్ ను చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. అలాగే అందరికీతో కమ్యూనికేషన్ చేయగలరు.

ముందుగా యూజర్ల తమ వాట్సాప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేయబడిందో, లేదో చూసుకోవాలి. కొత్త ఫీచర్ వినియోగించుకోవడానికి ఇది చాలా అవసరం. అనంతరం మీరు అనువదించాలనుకున్న మెసేజ్ ను నొక్కి పట్టుకోవాలి. అనువాదం ఎంపికను ఎంచుకోవాలి. అంతే అనువదించిన సందేశం ఒక పాప్ అప్ విండోలో కనిపిస్తుంది. దీని ద్వారా విభిన్న భాషలు మాట్లాడే వ్యక్తులు కూడా ఒకరితో ఒకరు చాలా సులభంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇతర దేశాల్లో ప్రయాణించేటప్పుడు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోెగపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి