ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఎకనామిక్స్ టైమ్స్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలో పారదర్శక, ధైర్యవంతమైన సంస్కరణలు అమలు చేసినందుకు ఆయనను సత్కరించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని మంత్రి లోకేష్ అభివర్ణించారు, చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.