AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iBOMMA Ravi: క్యూబ్ నెట్‌వర్క్‌ను సైతం హ్యాక్ చేసిన ఐబొమ్మ రవి..!

ఐబొమ్మ రవి ఎట్టకేలకు నోరువిప్పాడు. మూడోసారి కస్టడీలోకి రవిని ఇచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. రవి పైరసీ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. ఈ విచారణలో రవిపైరసీ నెట్‌వర్క్‌, బెట్టింగ్ యాప్స్‌తో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. ..

iBOMMA Ravi: క్యూబ్ నెట్‌వర్క్‌ను సైతం హ్యాక్ చేసిన ఐబొమ్మ రవి..!
Ibomma Ravi
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Dec 18, 2025 | 10:05 PM

Share

తెలుగు సినీ పరిశ్రమను కలవరపెడుతున్న హెచ్‌డీ సినిమా పైరసీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఐబొమ్మ రవిని పోలీసులు నాలుగోసారి కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో మూడు విడతలుగా కస్టడీకి తీసుకుని 11 రోజుల పాటు ప్రశ్నించినా పోలీసులు ఆశించిన స్థాయిలో సమాచారం రాలేదు. దీంతో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా, నాంపల్లి కోర్టు ఈసారి ఏకంగా 12 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐబొమ్మ రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు కాగా, వాటిలో నాలుగు కేసుల్లో ప్రశ్నించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున మొత్తం 12 రోజులు కస్టడీలో ఉంచి విచారించేందుకు అనుమతించింది. దాంతో ఇవాళ ఉదయం ఐబొమ్మ రవిని పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. తాజా విచారణలో పోలీసులకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మౌనం పాటించిన ఐబొమ్మ రవి.. హెచ్‌డీ సినిమా పైరసీపై ఎట్టకేలకు నోరువిప్పినట్లు సమాచారం. సినిమాల డిజిటల్ ప్రసారానికి ఉపయోగించే క్యూబ్ నెట్‌వర్క్‌ను సైతం హ్యాక్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శాటిలైట్ లింక్‌ను వినియోగించి HD ఫార్మాట్‌లో సినిమాలను రికార్డ్ చేసినట్టు గుర్తించారు. ఈ పైరసీ కంటెంట్‌ను టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా విక్రయించిన ఐబొమ్మ రవి, ఒక్కో లింక్‌కు 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. హిట్, తండేల్, కిష్కింధపురి, హిట్-3, OG వంటి తాజా సినిమాలను కూడా శాటిలైట్ లింక్ ద్వారానే పైరసీ చేసినట్టు ఆధారాలు లభించాయి.

ఐబొమ్మ రవి కేసులో మొదటి రోజు విచారణ ముగిసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ కార్యాలయంలో కొనసాగిన ఈ విచారణ మూడు గంటల పాటు సాగింది. విచారణలో రవి కొన్ని ప్రశ్నలకే సమాధానం ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. మొదటి రోజు పూర్తిగా సర్వర్ల అంశంపైనే పోలీసులు దృష్టి పెట్టారు. విదేశాల్లో దాచిన సర్వర్ల గురించి రవిని లోతుగా ప్రశ్నించారు. ఒక్కో సినిమాను మూవీ రూల్స్ నుంచి ఎంతకు కొనుగోలు చేశావు? అని ప్రశ్నించారు. సింగిల్, తండేల్, హిట్-3, కిష్కింధపురి, OG సినిమాలను ఎలా ప్రింట్ తీసి ఐబొమ్మలో అప్లోడ్ చేశావు? అని ప్రశ్నించారు. ఈ పైరసీకి నీతో కలిసి ఎవరు ఎవరు పనిచేశారన్న వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. పైరసీకి ఉపయోగించిన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉన్న మిగతా అడ్మిన్‌ల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. ప్రస్తుతం ఐబొమ్మ రవి విచారణలో పైరసీ ముఠాలతో ఉన్న లింకులు, పైరసీకి సంబంధించిన మూలాలు, బెట్టింగ్ యాప్స్‌తో సంబంధాలు, అలాగే ఆర్థిక లావాదేవీలపై పోలీసులు లోతుగా దృష్టి సారించారు. ఈ కేసులో ఇంకా ఎన్ని కీలక పేర్లు బయటపడతాయోనన్న ఉత్కంఠ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.