HDFC Bank: కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ షాక్.. వడ్డీ రేట్లపై కీలక అప్డేట్..
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్లలో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ ఏడాదిలో రెపో రేటును నాలుగోసారి తగ్గించింది. ఈ క్రమంలో దానికి అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది.

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ షాక్ ఇచ్చింది. ఫిక్స్ డ్ డిపాజిట్ రేట్లను తగ్గించింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే. గతంలో 5.50 శాతంగా ఉన్న రెపో రేటును 5.25 శాతానికి తగ్గించింది. అంటే 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని బ్యాంకులన్నీ అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా వడ్డీ రేట్లను బ్యాంకులన్నీ తగ్గిస్తున్నాయి. దీని వల్ల ఈఎంఐ, కొత్తగా లోన్లు తీసుకునేవారికి లాభం జరగనుండగా.. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకువారికి నష్టం జరగనుంది.
కొత్త వడ్డీ రేట్లు
ఫిక్స్‌డ్ డిపాజిట్లకు హెచ్‌డీఎఫ్‌సీ కొత్త వడ్డీ రేట్లను నిర్ణయించింది. ఏడాదిలోపు కాలవ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. ఇక 2 సంవత్సరాల టెన్యూర్ గల వాటిపై 6.45 శాతం, 5 ఏళ్ల టెన్యూర్ గల ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ 6.40 శాతంగా వడ్డీ రేట్లను ఫిక్స్ చేసింది. ఇక 5 నుంచి 10 ఏళ్ల కాలవ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 6.15 శాతంగా నిర్ణయించింది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తెచ్చింది.
తగ్గిస్తున్న బ్యాంకులు
ఇప్పటికే చాలా బ్యాంకులు రెపో రేటు ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించింది. ఇక త్వరలో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేయునున్నాయి. దీని వల్ల ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేవారికి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.




