ఏంటీ రా బాబు.. ఎంత కట్టినా హోమ్‌లోన్ అప్పు తీరడం లేదా.. బెస్ట్ ట్రిక్స్ మీకోసమే!
samatha
Pic credit - Instagram
ఇల్లు అనేది ప్రతి ఒక్కరి పెద్ద కల. దీని కోసం ఎంతో కష్టపడతారు. కానీ కొంత మంది మాత్రమే తమ కలను త్వరగా సాకారం చేసుకుంటారు.
అయితే ఈ మధ్య చాలా మంది ఇంటి నిర్మాణం సమయంలో ఎక్కువగా హోమ్ లోన్ తీసుకొని, తమ ఇంటిని అందంగా నిర్మించుకుంటున్నారు.
అయితే హోమ్ లోన్ తీసుకున్న సమయంలో ఆనందంగా అనిపించినప్పటికీ దానిని తీర్చడం మాత్రం చాలా కష్టం. కొంచెం ఫైనాన్షియల్‌గా బాగుండి, పెద్ద భవనాలు నిర్మించుకునే వారు త్వరగా హోమ్ లోన్ తీర్చేస్తారు.
కానీ సాధారణ వ్యక్తులు లక్షల్లో హోమ్ లోన్ తీసుకొని, దానిని తీర్చలేక ముప్పు తిప్పలు పడటమే కాకుండా, కొందరు ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుంది.
అందువలన అసలు హోమ్‌లోన్ త్వరగా ఎలా కంప్లీట్ చేయాలి? దీనిని కోసం ఎలాంటి ట్రిక్స్ పాటించాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీరు చాలా త్వరగా మీ హోమ్‌లోన్ క్లియర్ చేయాలి అనుకుంటే, దానిని 20 నుంచి 15 సంవత్సరాల్లో క్లియర్ చేయాలి అనుకుంటే ఈఎంఐ అనేది మొదటి ఏడాదిలో 12 పెట్టుకుంటే, 2 సంవత్సరంలో 13 ఈఎంఐలు చెల్లించేలా చేసుకోవాలి.
అలాగే ప్రతి ఏడాది మీ లోన్ పై 7.5శాతం పెంచుకుంటూ పోవాలి. అంటే మొదటి సంవత్సరం 40,000 కడితే, తర్వాత రూ.43000 ఇలా పెంచుకోవాలి.
ఇలా ప్రతి సంవత్సరం ఈఎంఐ పెంచుకుంటూ పోవడం వలన 25 సంవత్సరాల్లో కట్టాల్సిన ఈఎంఐ అనేది 20 సంవత్సరాల్లోనే కంప్లీట్ అవుతుంది.