- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine is getting chances in star hero movies, She is Nidhi Agarwal
వరుసగా బడా హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు.. కానీ హిట్ పడి చాలా కాలం అయ్యింది..
టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీల హడావిడి మాములుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జోరు మీదున్నారు. సినిమాల రిజెల్ట్‌తో సంబంధాలు లేకుండా వరుసగా ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ అమ్మడు కూడా అంతే .. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చింది ఈ చిన్నది.
Updated on: Dec 18, 2025 | 9:48 PM

టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీల హడావిడి మాములుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జోరు మీదున్నారు. సినిమాల రిజెల్ట్‌తో సంబంధాలు లేకుండా వరుసగా ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ అమ్మడు కూడా అంతే .. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చింది ఈ చిన్నది. తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంది. సినిమాలు హిట్స్ అవ్వకపోవడంతో గ్లామర్ గేట్లు ఎత్తేసింది.

తన అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో ఎనిమిది సినిమాలు చేసింది కానీ ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. అయినా కూడా ఈ చిన్నదానికి క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అందంలో అప్సరస ఆమె.. నటనలోనూ ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్‌గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది. మొత్తంగా ఈ చిన్నది 9 సినిమాలు చేసింది. వాటిలో ఒకే ఒక్క హిట్ అందుకుంది.

ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. నిధి అగర్వాల్ ఈ సినిమా హిట్ పై ఆశలు పెట్టుకుంది. కానీ హరిహర వీరమల్లు సినిమా కూడా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రభాస్ సినిమా నిధి అగర్వాల్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి.



