AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి ఐటీ శాఖ షాక్.. ఇంటితోపాటు పలు ప్రాంతాల్లో సోదాలు!

ముంబైలోని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. బాస్టియన్ రెస్టారెంట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పన్ను అవకతవకలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. శిల్పా శెట్టి ఇంట్లో, ఆమెకు సంబంధించిన ఇతర ప్రదేశాలలో ఆదాయపు పన్ను శాఖ పత్రాలను పరిశీలిస్తోంది.

బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి ఐటీ శాఖ షాక్..  ఇంటితోపాటు పలు ప్రాంతాల్లో సోదాలు!
Bollywood Actress Shilpa Shetty
Balaraju Goud
|

Updated on: Dec 18, 2025 | 9:47 PM

Share

ముంబైలోని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. బాస్టియన్ రెస్టారెంట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పన్ను అవకతవకలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. శిల్పా శెట్టి ఇంట్లో, ఆమెకు సంబంధించిన ఇతర ప్రదేశాలలో ఆదాయపు పన్ను శాఖ పత్రాలను పరిశీలిస్తోంది.

డిసెంబర్ 18వ తేదీ గురువారం ముంబైలోని శిల్పా జుహు ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ బృందం దాడి చేసింది. బెంగళూరులోని ఆమె ప్రసిద్ధ హోటల్ బాస్టియన్ గార్డెన్ సిటీకి సంబంధించిన కేసుకు సంబంధించి ఈ చర్యలు తీసుకుంది. ముంబైలోని హోటల్ ప్రదేశాలలోనే కాకుండా బెంగళూరులో కూడా ఐటీ శాఖ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

హోటల్ ఆర్థిక లావాదేవీలలో ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేత జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి. శిల్పా శెట్టి 2019లో బాస్టియన్ హాస్పిటాలిటీలో 50% వాటాను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ వ్యాపారవేత్త రంజీత్ బింద్రా యాజమాన్యంలో ఉంది. బాస్టియన్ పబ్ ఆర్థిక రికార్డులు, ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.

డిసెంబర్ 17వ తేదీ బుధవారం నాడు, ఆదాయపు పన్ను శాఖ కర్ణాటకలోని శిల్పా శెట్టి బాస్టియన్ రెస్టారెంట్ పై దాడి చేసింది. తాజాగా గురువారం, ఆమె ముంబై ఇంటిపై కూడా దాడులు జరిగాయి. శిల్పా నటి మాత్రమే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. ముంబై, గోవా, బెంగళూరు సహా ఇతర ప్రదేశాలలో ప్రసిద్ధ రెస్టారెంట్లను బాస్టియన్ పేరు నిర్వహిస్తున్నారు. ఈ విలాసవంతమైన రెస్టారెంట్ల ఫోటోలను తరుచుగా సోషల్ మీడియాలో శిల్ప పంచుకుంటుంది. అయితే, రూ. 60 కోట్ల మోసం కేసు, బాస్టియన్ ఐటీ దాడుల మధ్య, శిల్పా శెట్టి “అమ్మకై” అనే కొత్త రెస్టారెంట్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

గత సెప్టెంబర్‌లో, ముంబైలోని బాంద్రాలో ఉన్న శిల్పా ప్రసిద్ధ రెస్టారెంట్ బాస్టియన్ మూసివేయనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. శిల్పా సోషల్ మీడియాలో ఒక క్లిప్‌ను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఫోన్‌లో “లేదు, నేను బాస్టియన్‌ను మూసివేయడం లేదు, నేను హామీ ఇస్తున్నాను” అని చెప్పడం వినిపించింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..