Janmabhoomi Express: రైల్వేశాఖ బిగ్ అలర్ట్.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌లో మార్పులు.. కొత్తవి ఇవే..
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌లో మార్పులు చేసింది. లింగంపల్లి-విశాఖపట్నం మధ్య ఈ రైలు సర్వీసులు అందిస్తోంది. రోజూ వందలాది మంది ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఈ రైలు సమయాలను మార్చారు.

రైళ్లల్లో ప్రయాణించనివారంటూ ఎవరూ ఉండరు. ప్రతీఒక్కరూ ఏదో ఒక సమయంలో రైలు జర్నీ చేసి ఉంటారు. ఇండియాలో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉంది. దేశం నలుమూలలకు ఇది వ్యాపించి ఉంది. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రైలు సౌకర్యం అనేది అందుబాటులో ఉంది. రైల్వేశాఖ ఎప్పటికప్పుడు కొత్త రైల్వే స్టేషన్లను కూడా నిర్మిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. దూరపు ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి ట్రైన్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేయవచ్చు. అయితే ట్రైన్ ప్రయాణం చేసేవారు ఎప్పటికప్పుడు రైలు షెడ్యూల్స్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. రైల్వేశాఖ వీలును బట్టి కొన్ని రైళ్ల టైమింగ్స్ మారుస్తూ ఉంటుంది.
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు
దేశంలోనే వేగంగా వెళ్లే రైలుగా పేరు పొందిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విశాఖపట్నం-లింగంపల్లి (12805/12806) మధ్య నడిచే ఈ రైలు టైమింగ్స్‌ను దక్షిణ మధ్య రైల్వే మార్చింది. ఈ మేరకు ప్రయాణికులకు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కొత్త టైమింగ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
కొత్త టైమింగ్స్
ఇప్పటినుంచి విశాఖపట్నం-లింగంపల్లి(12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ తెనాలికి 12.45 గంటలకు చేరుకుని 12.55కు బయల్దేరనుంది. ఇక గుంటూరుకు 13.10 గంటలకు చేరుకుని 13.15కు బయల్దేరనుంది. తెనాలి, గుంటూరుకు చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రటకనలో వెల్లడించింది. ఇక ఈ రైలు విశాఖలో ఉదయం 6.20 గంటలకు బయల్దేరి రాత్రి 7.15 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 6.55 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరి రాత్రి 7.50 గంటలకు విశాఖకు చేరుకుంటుంది




