AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏకంగా 23 ఏళ్లు షూటింగ్.. సినిమా పూర్తయ్యే లోపు ఇద్దరు హీరోలు, ఓ డైరెక్టర్ చనిపోయారు..

కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలుస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. కొన్ని సినిమాలు తెరకెక్కడానికి ఏడాది పాటు టైం తీసుకుంటాయి. కొన్ని బడా సినిమాలు రెండు మూడు ఏడేళ్ల సమయం తీసుకుంటాయి. కానీ ఓ సినిమా ఏకంగా 23ఏళ్లు షూటింగ్ జరుపుకుంది.

ఏకంగా 23 ఏళ్లు షూటింగ్.. సినిమా పూర్తయ్యే లోపు ఇద్దరు హీరోలు, ఓ డైరెక్టర్ చనిపోయారు..
Movie News
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2025 | 7:41 PM

Share

రీసెంట్ డేస్ లో ఒక సినిమా తెరకెక్కించడం చాలా సింపుల్ అయిపొయింది. కొంతమంది దర్శకులు కొన్ని సినిమాలను నెల రోజుల్లోనే లేదా 90రోజుల్లోనే తెరక్కించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇంకొన్ని సినిమాలు మాత్రం రెండు , మూడు సంవత్సరాలపాటు షూటింగ్స్ జరుపుకుంటుంటాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలు నాలుగు ఐదేళ్లు షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలు షూటింగ్స్ మధ్యలోనే ఆడిపోతూ ఉంటాయి. హీరోల కారణంగానో, హీరోయిన్స్ కారణంగానో కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంటాయి అయితే ఇండస్ట్రీలో ఓ విచిత్రమైన సినిమా ఉంది. ఆ సినిమా షూటింగ్ ఏకంగా 23 ఏళ్లు షూటింగ్ జరుపుకుంది.

సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!

ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఇద్దరు హీరోలు, డైరెక్టర్ కూడా చనిపోయాడు. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఇంతకూ ఆ సినిమా ఎదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన లవ్ అండ్ గాడ్. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఓ అన్ లక్కీ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాకు మరో పేరు కూడా ఉంది. అదే కైస్ అండ్ లైలా. ఈ సినిమా 1963లో మొదలైంది. కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ఊహించని మలుపులు తిరిగింది. ఈ సినిమాలో కైస్ అనే పాత్రలో హీరో గురు దత్ నటించారు. అయితే షూటింగ్ మధ్యలో ఉండగానే హీరో గురు దత్ చనిపోయారు.

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్

1964 గురు దత్ కన్నుమూశారు. దాంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆతర్వాత సంజీవ్ కుమార్‌‌ను హీరోగా పెట్టి సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ సినిమాకు ఆసిఫ్ దర్శకత్వం వహించారు. అయితే ఇంతలోనే షూటింగ్ జరుగుతుండగా డైరెక్టర్ , ప్రొడ్యూసర్ ఆసిఫ్ చనిపోయారు. దాంతో షూటింగ్ మరోసారి బ్రేక్ పడింది. ఆతర్వాత దర్శకుడు ఆసిఫ్ భార్య అక్తర్ ఆసిఫ్ ఎలాగైన ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలనుకున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్ ను వేరు వేరు స్టూడియోలు తెరకెక్కించాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే హీరో సంజీవ్ కుమార్ కూడా మరణించారు. మొత్తంగా సినిమా 1986లో రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ సినిమా 23ఏళ్లు తెరకెక్కింది. ఇద్దరు హీరోలు, ఒక దర్శకుడు చనిపోయారు. దాంతో బాలీవుడ్ లో ఓ మోస్ట్ అన్ లక్కీ మూవీగా నిలిచింది ఈ సినిమా..

ఇవి కూడా చదవండి

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.