- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine is who is a kickboxer, Her name is Ritika Singh
బాక్సింగ్‌లో తోపు.. అందంలో అప్సరస ఈ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
సినీ సెలబ్రెటీలు కేవలం నటనలోనే కాదు.. తమ ప్రతిభను ఇతర రంగాల్లోనూ కనబరుస్తూ ఉంటారు.. కొంతమంది స్పోర్ట్స్ లో మరికొంతమంది పెయింటింగ్, ఇంకొంతమంది రేసింగ్ ఇలా రాణిస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్.. మనదగ్గర ఉన్న హీరోయిన్స్ లో చాలా మంది మల్టీ టాలెంటడ్ ముద్దుగుమ్మలు ఉన్నారు వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఒకరు.
Updated on: Dec 18, 2025 | 9:42 PM

సినీ సెలబ్రెటీలు కేవలం నటనలోనే కాదు.. తమ ప్రతిభను ఇతర రంగాల్లోనూ కనబరుస్తూ ఉంటారు.. కొంతమంది స్పోర్ట్స్ లో మరికొంతమంది పెయింటింగ్, ఇంకొంతమంది రేసింగ్ ఇలా రాణిస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్.. మనదగ్గర ఉన్న హీరోయిన్స్ లో చాలా మంది మల్టీ టాలెంటడ్ ముద్దుగుమ్మలు ఉన్నారు వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఒకరు.

తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మెప్పించే ఈ చిన్నది. మరో రంగంలోనూ తన ప్రతిభను చాటుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ మార్షల్ ఆర్ట్స్ లో తోపు ఆమె.. అలాగే బాక్సింగ్ లోనూ నైపుణ్యంలో టాప్. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె ఎవరో కాదు.. అందాల భామ రితిక సింగ్.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వయ్యారి భామ రితిక సింగ్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమానే అయినా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రితిక.

ఇక అందాల భామ రితికా సింగ్ 16 డిసెంబర్ 1994న ముంబైలో జన్మించింది.. రితిక నటి మాత్రమే కాదు ఆమె గొప్ప మార్షల్ ఆర్టిస్ట్ కూడా.. చిన్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకు క్రీడలంటే మక్కువ ఎక్కువ. అంతే కాదు ఆమె బాక్సర్ కూడా..

ఈ ముద్దుగుమ్మ 2009లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే సూపర్ ఫైట్ లీగ్‌ను గెలిచింది. దీని తరువాత, ఆమె సుధా కొంగర దర్శకత్వం వహించిన “ఇరుతి చూడ్” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో నటిగా అరంగేట్రం చేసింది. అదే సినిమా గురు టైటిల్ తో తెలుగులో రీమేక్ అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.