- Telugu News Photo Gallery Cinema photos Kalvakuntla Kavitha Appreciates Raju Weds Rambai Movie Team, See Photos
Raju Weds Rambai Movie: కల్వకుంట్ల కవితను కలిసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ టీమ్.. కారణమిదే..
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇటీవలే రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా యూనిట్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్మానించి అభినందించింది.
Updated on: Dec 18, 2025 | 7:16 PM

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి సినిమా. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు

తెలంగాణకు చెందిన కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ గా ఆకట్టుకున్నాడు

నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మంచి విజయం అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి టీమ్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్మానించింది.

గురువారం (డిసెంబర్ 18) డైరెక్టర్ సాయిలు కంపాటి, నిర్మాత వేణు ఊడుగుల తదితర చిత్ర కవిత ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఇవాళ్టి నుంచే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.



