18 December 2025
ఏదైనా చేయడమే నాకు ఇష్టం.. మీనాక్షి ఫిట్‌నెస్ రహస్యం ఇదేనట..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. వరుస హిట్లతో సినీరంగంలో దూసుకుపోతుంది ఈ అమ్మడు.
హర్యానాకు చెందిన ఈ అమ్మడు ముంబైలో మిస్ ఇండియా పోటీలో గెలిచింది. ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్టు నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంటుంది. అంతేకాదు ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది.
2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తన సినీరంగ ప్రవేశం చేసిన ఆమె.. ఇప్పుడు తెలుగులో గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది.
ఇదెలా ఉంటే.. ఈ అమ్మడు తన ఫిట్నెస్, లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. అందానికి రహస్యాన్ని రివీల్ చేశారు.
తనను తాను ఫిట్ ఉంచుకోవడానికి.. అలాగే ప్రపంచాన్ని వేరే కోణం నుండి చూడటానికి సహాయపడే ఏదైనా చేయడం నాకు చాలా ఇష్టం అని అన్నారు.
యోగా, ధ్యానం చేయడానికి ఇష్టపడతానని.. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తానని అన్నారు. ఫిట్‌నెస్ అనేది మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
మానసికంగా బలంగా ఉండేందుకు ట్రై చేస్తానని.. ప్రతి సవాలును స్వీకరించడమే కాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ట్రై చేస్తానని అన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్