అందం అభినయం ఉన్నా అవకాశాలు మాత్రం అందని ద్రాక్ష ఈ అమ్మడికి.. 

18 December 2025

Pic credit - Instagram

Rajeev 

సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది.

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.. తనే నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ చాలా మంది ఫేవరెట్ హీరోయిన్.

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఒక్కసారిగా గ్లామర్ క్రేజ్ సంపాదించుకుంది.

డీజే టిల్లు తర్వాత నేహాకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నేహాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

మాస్ కా దాస్ విశ్వక్ దాస్ హీరోగా నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో కనిపించింది. హీరో కార్తికేయ జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది.

అయితే అందమెంత ఉన్న ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ స్టార్ డమ్ మాత్రం రాలేదు. తన అందంతో కవ్వించింది కానీ అవకాశాలు మాత్రం తక్కువే..

ఓవైపు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.