AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Hole Picture: పాలపుంతలో అద్భుతం.. భారీ ‘బ్లాక్‌ హోల్’ ఫోటో విడుదల చేసిన సైంటిస్టులు..

Massive Black Hole Picture: ఈ అనంత విశ్వంలో ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన పాలపుంతలోనే ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు బోలెడు ఉన్నాయి.

Black Hole Picture: పాలపుంతలో అద్భుతం.. భారీ ‘బ్లాక్‌ హోల్’ ఫోటో విడుదల చేసిన సైంటిస్టులు..
Black Hole
Shiva Prajapati
|

Updated on: May 13, 2022 | 6:14 AM

Share

Massive Black Hole Picture: ఈ అనంత విశ్వంలో ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన పాలపుంతలోనే ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు బోలెడు ఉన్నాయి. వాటిని ఛేదించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికీ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతమైన ఫోటోను విడుదల చేశారు. పాలపుంతలో ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్‌ హోల్‌కు సంబంధించిన తొలి చిత్రాన్ని విడుదల చేశారు. పాలపుంతలో ఉన్న బ్లాక్ హోల్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఈ బ్లాక్‌ హోల్స్‌ కాంతి, పదార్థాలు ఉండవు. అందుకే వాటి చిత్రాలను పొందడం కూడా చాలా కష్టతరం అవుతుంది. భారీ ఉష్ణోగ్రతతో కూడిన వాయువు, దూళితో పాటు ఆ అగాథంలోకి లాగేసుకుంటుంది.

అయితే, దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది రేడియో టెలిస్కోప్‌ల ఒక్కటిగా చేసిన ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ ద్వారా దీనిని ఆవిష్కరించడం జరిగిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచి ఇమేజ్‌ని తీయడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యింది. అది స్థిరంగా లేకపోవడం వల్ల ఇమేజ్ క్యాప్చర్ కష్టతరం అయ్యిందని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ పరిశోధకులు ఫెరియల్ ఓజెల్ తెలిపారు. తాజాగా తీసిన భారీ బ్లాక్‌ హోల్‌ ఫోటోకు ‘సున్నితమైన దిగ్గజం’ అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యొక్క సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఐన్‌స్టీన్ సమీకరణాలు నిర్దేశించే పరిమాణంగా నిర్ధారించింది. ఇది మన సూర్యుని చుట్టూ మెర్క్యురీ కక్ష్య పరిమాణంలో ఉంటుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, సాధారణంగా బ్లాక్‌ హోల్స్ విశ్వంలోని పదార్థాలన్నింటినీ తనలోకి పీల్చుకుంటాయి. కానీ, ఈ బ్లాక్ హోల్ మాత్రం చాలా సున్నితంగా ఉందని పేర్కొన్నారు. చాలా తక్కువగా తనలోకి పీల్చుకుంటుందని చెప్పుకొచ్చారు. అంటే.. ఇది మిలియన్ల సంవత్సరాలలో ఒక వ్యక్తి లేదా ఒక బియ్యం గింజను తినడంతో సమానంగా పోల్చారు. వాస్తవానికి పాలపుంతలోని బ్లాక్ హోల్స్ చాలా భయంకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారట. కానీ, అందుకు భిన్నంగా ఇది ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ బ్లాక్ హోల్‌ను ప్రేమిస్తున్నామంటూ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

కాగా, ఇదే మొదటి బ్లాక్ హోల్ ఫోటో కాదు. 2019లోనూ ఒక బ్లాక్‌ హోల్‌కు సంబంధించిన ఫోటోను ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇది 53 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలోనిది. ఇది.. ప్రస్తుతం మన పాలపుంతలో తీసిన బ్లాక్ హోల్ కంటే 1,500 రెట్లు పెద్దది. కాగా, ఈ చిత్రాన్ని తీయడానికి ఎనిమిది టెలిస్కోప్‌లను సమన్వయం చేశారు సైంటిస్టులు. యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఈ ప్రాజెక్టు కోసం 60 మిలియన్ల డాలర్లను ఖర్చు చేసింది. మన పాలపుంతలో ఉన్న బ్లాక్ హోల్ చాలా బాగుందని సైంటిస్టులు అబ్బురపడిపోతూ చెప్పారు.