WhatsApp New Feature: వాట్సప్‌ యూజర్లకు అదిపోయే న్యూస్.. అందుబాటులోకి రానున్న సరికొత్త ఫీచర్..

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp మరో సరికొత్త ఫీచర్ బీటా వెర్షన్‌లో కనిపించింది. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి లాంచ్ అవుతుందో తెలియడం లేదు. త్వరలో మనం యాప్‌లో చాటింగ్‌కు సంబంధించిన..

WhatsApp New Feature: వాట్సప్‌ యూజర్లకు అదిపోయే న్యూస్.. అందుబాటులోకి రానున్న సరికొత్త ఫీచర్..
Whatsapp
Follow us

|

Updated on: May 13, 2022 | 7:48 AM

WhatsApp వినియోగదారులకు గుడ్ న్యూస్. ఎప్పటికప్పుడు చాటింగ్(Chat) అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను జోడిస్తున్న వాట్సప్.. అన్ని ఇతర యాప్‌లతో పోల్చితే ముందే ఉంటుంది. ఇటీవలూ కంపెనీ మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ని జోడించిన సంగతి తెలిసిందే. త్వరలో మనం ఈ ప్లాట్‌ఫారమ్‌లో మరో కొత్త ఫీచర్‌ను అందుకోనున్నాం. చాట్ ఫిల్టర్ అనే ఆప్షన్‌ను అందించేందుకు వాట్సప్ సిద్ధమైంది. దీని పేరు సూచించినట్లుగా, ఈ ఫీచర్ వినియోగదారులకు చాట్‌లను వివిధ క్యాటగిరీలను ఫిల్టర్ చేసే ఎంపికను అందిస్తుంది. Gmail, ఇతర ఈమెయిల్ సేవలలో ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. అయితే, ఈ ఫీచర్ ఈమెయిల్ సేవలకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

ఫీచర్ ఎలా పని చేస్తుందంటే?

వాట్సాప్ తాజా ఫీచర్‌ను WAbetainfo గుర్తించింది. నివేదికల ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ క్లయింట్‌లకు అందుబాటులో ఉంది. ఈ మేరకు స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. దీనిలో బీటా టెస్టర్‌లు ఫిల్టర్ ఎంపికను పొందినట్లు చూపిస్తుంది.

ఫిల్టర్‌లను శోధించేందుకు కూడా ఆప్షన్ అందించింది. ఇక్కడ వినియోగదారులు నాలుగు ఎంపికలను పొందుతారు. ఇందులో చదవని చాట్‌లు, కాంటాక్ట్, నాన్-కాంటాక్ట్, గ్రూప్ ఇలాంటివి ఇందులో ఉన్నాయి. ఆర్కైవ్ చాట్‌ని ఉపయోగించే వినియోగదారులకు ఈ ఫీచర్ మంచి ఎంపికగా ఉండనుంది.

అందుబాటులోకి ఇన్‌స్టాగ్రామ్‌లో క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్..

అయితే వాట్సాప్‌లో క్లోజ్ ఫ్రెండ్స్‌ను గుర్తు పెట్టుకునే ఆప్షన్‌ని జత చేసి ఉంటే ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నిహిత స్నేహితుల ఎంపిక అందుబాటులో ఉంది. కానీ, ఈ ఆప్షన్ చాట్‌లకు కానీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేయడానికి కానీ అందుబాటులో లేదు.

ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు తమ కథనాలను నిర్దిష్ట వ్యక్తుల సమూహంతో పంచుకోవచ్చు. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. నివేదికలో షేర్ చేయబడిన స్క్రీన్‌షాట్ WhatsApp వెబ్ లేదా డెస్క్‌టాప్ వెర్షన్‌గా తెలుస్తోంది.

నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ iOS, Android వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ ఇటీవల అనేక కొత్త ఫీచర్ల వివరాలను పంచుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నో సరికొత్త ఫీచర్లు జగకానున్నాయి.

మరిన్ని టెక్నాలజీ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Google: యూజర్లను హెచ్చరించిన గూగుల్‌.. క్రోమ్‌ బ్రౌజర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన..

Google Translate: యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన గూగుల్‌.. ట్రాన్స్‌లేషన్‌లో కొత్తగా మరో 24 భాషలు..

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!