Karnataka: బాబోయ్ ఇదేం ఆచారం.. నిప్పులను చల్లుకుంటూ పరవశించిపోతున్న భక్తులు..!

Karnataka: బాబోయ్ ఇదేం ఆచారం.. నిప్పులను చల్లుకుంటూ పరవశించిపోతున్న భక్తులు..!
Fire

Karnataka: మన భారతదేశం భిన్న మతాలు, భిన్న కులాలకు ఆలవాలం. అందూలోనూ భిన్న జాతుల వారు.. విభిన్నమైన ఆచార సంప్రదాయాలు

Shiva Prajapati

|

May 13, 2022 | 6:00 AM

Karnataka: మన భారతదేశం భిన్న మతాలు, భిన్న కులాలకు ఆలవాలం. అందూలోనూ భిన్న జాతుల వారు.. విభిన్నమైన ఆచార సంప్రదాయాలు కలిగిన వారు మనదేశంలో ఉన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన జీవన శైలి. ఒక్కో ఆచార వ్యవహారాలు ఉంటాయి. తాజాగా కర్ణాకటలోని ఓ వింత ఆచారినికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని దేవరగట్టులో కర్రల యుద్ధం మాదిరిగా.. కర్ణాటకలో ‘అగ్నిఖేలి’ చాలా ఫేమస్. మంగళూరుకు 30 కిమీ దూరంలో వున్న కటీల్‌ దుర్గమాత ఉత్సవాల్లో అగ్నిఖేళి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భక్తులు ఒకరిపై ఒకరు నిప్పులు విసురుకుంటారు. చూడ్డానికి ఒళ్లు జలదరిస్తుంది. ఇక గ్రౌండ్‌వున్న వాళ్లకు ఒళ్లు కాలుతుంది కూడా. అయినా వారు పట్టించుకోరు. తరతరాలుగా వస్తోన్న ఆచారం. నమ్మకం. గాయాలను లెక్క చేయకుండా అగ్నిఖేళిలో చిందేస్తారు. అగ్నిగుండాల్లో భక్తి పారవశ్యంతో పరవశించిపోతారు భక్తులు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి దృశ్యాలు కన్పిస్తూనే ఉంటాయి.

మరోచోట కూడా ఇదే ఆచారం.. కర్ణాకటలోనే మరో చోట కూడా ఇలాంటి ఆచారమే ఉంది. రామనగర జిల్లా హరూర్‌లో కందకంలో అగ్ని గుండం ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు నిప్పులపై నడిచి తమ భక్తిని చాటుకుంటారు. చుట్టూ జనం.. భక్తి పారవశ్యంతో కేరింతలు.. కోరికలు తీరాలనో.. తీరాయనో భక్తులు నిప్పులపై నడిచి వెళ్లడం ఉత్సవంలో ఓ భాగం. ఈ పండుగ నిర్వహణకు అంతా సిద్దమైంది. కణకణమండే నిప్పులతో కందకం సిద్దమైంది. దరువేశారు. మెడలో దండ.. చేతిలో ఖడ్గం.. ఇక ఫైర్‌ వాక్‌కు అంతా రెడీ.. జనం కేరింతలో ఓ వ్యక్తి ఉరిమే ఉత్సాహంతో అగ్నిబరిలోకి దిగారు. ఫ్లవర్‌ అనుకుంటివా ఫైర్‌ అనే రేంజ్‌లో ముందడగు వేశాడు.

అయితే, నిప్పులపై రెండు అడుగులు వేశాడో లేదో అగ్గి భగ్గుమంది. నిప్పుల పడిపోయాడు.. ఒకసారి కాదు.. రెండు మూడు సార్లు.. అయినా జనం కేరింతలు ఆగలేదు.. ఎవరూ చెయ్యిచ్చి అతన్ని పైకిలాగలేదు. ఏది ఏమైనా టాస్క్‌ ఫినిష్‌ చేయాలనుకన్నాడో.. రక్షించడానికి ఎవరూ ముందుకు రావడం లేదనుకున్నాడో కానీ నిప్పుల కందకంలో పరుగెత్తాడు. చివరకు అతన్ని కందకం నుంచి బయటకు లిఫ్ట్‌ చేశారు. కానీ నిప్పులపై పడ్డంతో అప్పటికే అతనికి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు కోకొల్లలు.

అయితే, ప్లాట్ గా ఉన్న నేలపై ఏర్పాటు చేసి అగ్నిగుండంలో నడక చాలా ఈజీ. కాసింత జాగ్రత్తలు తీసుకుంటే నిప్పుల నడక పెద్ద కష్టమేమి కాదు. కానీ కందకాల్లో ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడవడమంటే మాటలు కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బర్నాల్‌ రాసినా తగ్గని గాయాలు కావడం ఖాయం. కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం. భక్తి సంగతి ఎలా వున్నా ఇందులో సైన్స్‌ వుంది. నిప్పుపై కాలు ఇలా పెట్టగానే చెమటతో తడి ఏర్పడుతుంది. కాలికి నిప్పుకు మధ్య తెరలా ఈ తడి కాపాడుతుంది. అది గమనించి నడిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఎవరూ కాదనలేరు. కానీ విశ్వాసాలతో ప్రాణాలు ముఖ్యం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu