Apple News: 6 కోట్ల జీతం.. ఆఫీసుకి రమ్మనే సరికి ఆపిల్ ఉన్నతాధికారి షాకింగ్ నిర్ణయం..

Apple employee resignation: కరోనా ప్రభావం దాదాపుగా తగ్గింపోవటంతో కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. రెండేళ్లుగా ఇళ్ల వద్ద నుంచే పనిచేసిన చాలా మంది ఆఫీసులకు రమ్మనటంతో రిజైన్ చేస్తున్నారు.

Apple News: 6 కోట్ల జీతం.. ఆఫీసుకి రమ్మనే సరికి ఆపిల్ ఉన్నతాధికారి షాకింగ్ నిర్ణయం..
Apple
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 13, 2022 | 5:52 PM

Apple employee resignation: కరోనా ప్రభావం దాదాపుగా తగ్గింపోవటంతో కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. రెండేళ్లుగా ఇళ్ల వద్ద నుంచే పనిచేసిన చాలా మంది ఆఫీసులకు(Work from office) రమ్మనటంతో రిజైన్ చేస్తున్నారు. ఉద్యోగుల్లో క్రియేటివిటీ, ఉత్పాదకత తగ్గుతుందని కంపెనీలు అంటుంటే.. సమయం వృధా కావటంతో పాటు, ఇతర సమస్యలను ఉద్యోగులు కారణాలుగా చెబుతున్నారు. తాజాగా వైట్‌హ్యాట్(Whitehat) కంపెనీకి చెందిన దాదాపు 800 మంది ఉద్యోగులు సైతం రాజీనామాలు చేసి కంపెనీకి షాక్ ఇచ్చారు. అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి ఆపిల్ కంపెనీలో జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే..

ఆపిల్ కంపెనీలో మెషిన్ లెర్నింగ్ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇయాన్ గుడ్‌ఫెలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీనిలో వింత ఏమి ఉందా అని అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది ట్విస్ట్. ఇంతకీ ఆయన జీతం ఎంతో తెలిస్తే మీరు అవాక్కవుతారు. అక్షరాలా 6 కోట్ల రూపాయలు జీతం తీసుకున్నారు. ఇంత మంచి ప్యాకేజ్ ఉన్నా.. ఆఫీసుకు రమ్మనే సరికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆపిల్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. మే 23 నుంచి వారంలో మూడు రోజులు తప్పకుండా ఆఫీసు నుంచే ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో అసంతృప్తి చెందిన ఇయాన్ గుడ్‌ఫెలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా.. ఆపిల్ ఉద్యోగులు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలను కంపెనీ సీఈవో టిమ్ కుక్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ కూడా రాశారు.

2019లో ఇయాన్ ఆపిల్ సంస్థలో చేరారు. తాను మెషిన్ లెర్నింగ్ నిపుణుడిగా లింక్డిన్‌లో పేర్కొన్నారు. ఈయనకు వేతనం ఎంతో అధికారికంగా తెలియనప్పటికీ.. సంబంధిత వర్గాల సమాచారం మేరకు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. టెక్ ప్రపంచంలోనే హై ప్రొఫైల్ కావడంతో ఆయనకు ఆపిల్ డైరెక్టర్ స్టేటస్‌ను ఇచ్చింది. 2009లో స్టాన్‌ఫోర్డ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత.. మాన్‌ట్రియల్ యూనివర్సిటీ నుంచి మెషిన్ లెర్నింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. గూగుల్ బ్రెయిన్ టీమ్‌లో ఇయాన్ పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత ఎలాన్ మస్క్ ఏర్పాటు చేసిన రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓపెన్‌ఏఐలో పనిచేశారు. ఆపిల్‌లో చేరకముందు.. మళ్లీ గూగుల్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆపిల్‌లో ఆయన రిజైన్ చేయడంతో.. పలు సంస్థలు ఇయాన్‌ను రిక్రూట్ చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి..

LIC IPO: ఎల్ఐపీ ఐపీవో అప్లై చేసినవారికి షాక్.. షేర్లు పొందేవారికి నష్టం తప్పదా..! ఇక్కడ చెక్ చేసుకోండి..

Stock Market: రోజంతా ఊగిసలాటలో సూచీలు.. వారాంతంలో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..