AC Rates Hike: AC ప్రియులకు హీటెక్కించే న్యూస్.. భారీగా పెరిగిన ఎయిర్ కండీషనర్‌ల రేట్లు.. కారణమేంటంటే..

AC Rates Hike: అసలే వేసవి కాలం. కాస్త ఏసీలో చల్లబడదామని అందరూ అనుకుంటుంటారు. ఈ సంవత్సరం ఎండలు, వేడి గాలులు ఎక్కువగా ఉండడంతో అనేక మంది తమ స్థోమతకు సరిపడే ఏసీలు, కూలర్లు(Coolers) వంటివి కొనుక్కుంటున్నారు. కానీ..

AC Rates Hike: AC ప్రియులకు హీటెక్కించే న్యూస్.. భారీగా పెరిగిన ఎయిర్ కండీషనర్‌ల రేట్లు.. కారణమేంటంటే..
Air Conditioner
Follow us

|

Updated on: May 13, 2022 | 6:47 PM

AC Rates Hike: అసలే వేసవి కాలం. కాస్త ఏసీలో చల్లబడదామని అందరూ అనుకుంటుంటారు. ఈ సంవత్సరం ఎండలు, వేడి గాలులు ఎక్కువగా ఉండడంతో అనేక మంది తమ స్థోమతకు సరిపడే ఏసీలు, కూలర్లు(Coolers) వంటివి కొనుక్కుంటున్నారు. విద్యుత్ కోతలు(Power Cuts), పెరిగిన కరెంటు ఛార్జీలు ఉన్నప్పటికీ ఒక ఏసీ కొనాలని అనుకునే వారిపై మరో షాక్ ఇస్తున్నాయి కంపెనీలు. అదేంటంటే.. ఇంధన ధరలు పెరగడం, గ్లోబల్ కాంపోనెంట్స్ కొరత వంటి అనేక కారణాల వల్ల భారతీయ AC తయారీదారులు ధరలను పెంచారు. ఈ నిర్ణయం కారణంగా ఏసీల రేట్లు 3 నుంచి 4 శాతం మేర పెరిగాయి. తప్పని పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఇందుకు ప్రధానంగా చైనాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌లు, ముడి సరుకు కొరత, వస్తువుల ధరల ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడ్డ అనేక పరిస్థితులు ఈ భారానికి కారణమని జాన్సన్ కంట్రోల్స్-హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ అంటున్నారు.

జూన్‌ నెలలో ఎయిర్ కండీషనర్ ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరుగుతాయని ఒక ప్రకటనలో గుర్మీత్ సింగ్ తెలిపారు. కరోనా కారణంగా ఎలక్ట్రానిక్స్ రంగం ఇప్పటికే ప్రతి క్వార్టర్ లో ఉత్పత్తుల రేట్లు 2-3 శాతం మేర పెంచుతున్నాయి. సప్లై చైన్ అంతరాయాల కారణంగా FMCG కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు  పెంచుతూనే ఉన్నాయి. మరో పక్క చైనాలో లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు డెలివరీలను ఆలస్యం చేయటం కూడా ఊహించని పెంపుకు కారణం అవుతున్నాయి. మరో పక్క భారత కరెన్సీ డాలర్ తో మారకపు విలువను కోల్పోవటం కూడా రామెటీరియల్ కొనుగోలుకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోందని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు.

ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. పండుగ సీజన్ సేల్స్ కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతింటాయని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అనేక కారణాల ప్రభావం ఎయిర్ కండీషనర్‌ల డిమాండ్ తగ్గిస్తున్నాయని కంపెనీలు పేర్కొంటున్నాయి. PLI స్కీమ్, ఇతర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా దేశీయ తయారీని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల భవిష్యత్తులో పరిశ్రమ, పర్యావరణ వ్యవస్థ మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇది చివరికి వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Apple News: 6 కోట్ల జీతం.. ఆఫీసుకి రమ్మనే సరికి ఆపిల్ ఉన్నతాధికారి షాకింగ్ నిర్ణయం..

LIC IPO: ఎల్ఐపీ ఐపీవో అప్లై చేసినవారికి షాక్.. షేర్లు పొందేవారికి నష్టం తప్పదా..! ఇక్కడ చెక్ చేసుకోండి..