ఒట్టి చేతులతో చిరుతని మట్టుబెట్టిన యువకుడు!
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు చిరుతపులితో సాహసోపేత పోరాటం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అర్కి ఐటీఐ విద్యార్థి ప్రవేశ్ శర్మ సోమవారం ఉదయం పాలు తీసుకురావడానికి పొలం గుండా వెళ్తుండగా, ఒక చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసింది. అలాంటి పరిస్థితిలోనూ ప్రవేశ్ అధైర్యపడకుండా, సుమారు 12 నిమిషాల పాటు ఆ చిరుతతో పెనుగులాడాడు. ఏడాదిన్నర వయసున్న ఆ చిరుత తన పంజాలతో రక్కేందుకు ఎంత ప్రయత్నించినా, ప్రవేశ్.. దాని దవడలను చేతులతో గట్టిగా పట్టుకుని ప్రతిఘటించాడు. దీంతో అలసిపోయిన చిరుత.. చివరకు ప్రాణాలు విడిచింది.
సుమారు 12 నిమిషాల పాటు సాగిన ఈ భీకర పోరాటంలో, చిరుత గోళ్లు తగలటంతో ప్రవేశ్ బట్టలన్నీ రక్తసిక్తమయ్యాయి. అయితే, ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు. మార్చి 6 నుంచే చిరుత సంచారంపై అటవీ శాఖకు ఫిర్యాదు చేసినా, బోను ఏర్పాటు చేయడంలో వారు విఫలమయ్యారని ప్రవేశ్ బాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.చిరుతతో పోరాడి గెలిచిన ప్రవేశ్ శర్మ సాహసంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే అటవీ శాఖ డివిజనల్ అధికారి రాజ్‌కుమార్ శర్మ ఘటనా స్థలాన్ని సందర్శించి, గాయపడిన ప్రవేశ్‌కు తక్షణ సహాయంగా రూ. 5,000 అందజేశారు. వన్యప్రాణుల సహజ ఆవాసాలు దెబ్బతినడం వల్లే అవి ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాధారణంగా చిరుతలు రాత్రి వేళల్లో వేటాడుతాయని, కానీ ఈ చిరుత తెల్లవారుజామునే దాడికి దిగిందంటే అది ఎంతటి ఆకలితో ఉందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. చావు అంచుల్లో నిలబడి మృగాన్ని మట్టుబెట్టిన ప్రవేశ్ శౌర్యసాహసాల గురించి తెలుసుకున్న స్థానికులు, తోటి విద్యార్థులు అతడిని హీరోగా అభివర్ణిస్తున్నారు. అసాధారణ తెగింపుతో ప్రాణాలను
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

