AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy : తండ్రికి మరోసారి షాకిచ్చిన జాసన్ సంజయ్.. విజయ్‏కు ఇంట్లోనే దెబ్బ మీద దెబ్బ..

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దళపతి విజయ్ పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు తన పార్టీ కార్యక్రమాలు, ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్ కు అతడి భార్య సంగీత ఊహించని షాకిచ్చింది. తన భర్తకు మరో నటితో ఎఫైర్ ఉందంటూ విడాకుల కోసం కోర్టుకెక్కింది. ఈ వివాదంలో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ తన తల్లి వైపు నిలబడినట్లు తెలుస్తోంది.

Vijay Thalapathy : తండ్రికి మరోసారి షాకిచ్చిన జాసన్ సంజయ్.. విజయ్‏కు ఇంట్లోనే దెబ్బ మీద దెబ్బ..
Jason Sanjay, Vijay Thalapa
Rajitha Chanti
|

Updated on: Mar 12, 2026 | 3:13 PM

Share

తమిళ స్టార్ విజయ్ దళపతి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై సినిమాల్లో నటించనని రిటైర్మెంట్ తీసుకున్నానంటూ అభిమానుల సమక్షంలో ప్రకటించిన విజయ్.. ఇప్పుడు తన దృష్టి మొత్తాన్ని ఎన్నికలపై పెట్టాడు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అనుహ్యంగా విజయ్ వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన భర్తకు మరో నటితో అక్రమ సంబంధం ఉందంటూ ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. ఈ వ్యవహారం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. 27 సంవత్సరాల తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలనుకుంటున్నట్లు సంగీత వెల్లడించింది. ఈ కేసకు సంబంధించి ఏప్రిల్ 20న విచారణ జరగనుంది. ఆ రోజున విజయ్ కోర్టుకు హాజరుకానున్నారు.

ఎక్కువమంది చదివినవి : Dil Raju: హీరోయిన్‏కు కళ్లు లేవని ఎవరు కొనలేదు.. నేను తీసుకుని రిలీజ్ చేశా.. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. దిల్ రాజు..

మరోవైపు విజయ్, సంగీత విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తనను విజయ్ ఇంట్లోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని.. దాదాపు 5 సంవత్సరాలుగా తాను నరకం అనుభవిస్తున్నానని మరోసారి సంగీతం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ విషయంలో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ సైతం తన తండ్రికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సోషల్ మీడియాలో విజయ్ ను అన్ ఫాలో చేసిన జాసన్ సంజయ్.. ఇప్పుడు తన ఇంటి పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తండ్రి ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని తమ పేరుకు ఇన్షియల్ గా ఉపయోగించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు జాసన్ సంజయ్ మాత్రం ఇన్షియల్ పేరును మార్చినట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీనే అల్లాడించిన గ్లామరస్ బ్యూటీ.. క్యాన్సర్‏ను జయించి ఇలా..

తండ్రి విజయ్ పేరుతో వచ్చే వి అక్షరాన్ని తొలగించి తన తల్లి సంగీత పేరులోని ఎస్ అక్షరాన్ని పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం హీరోగా కాకుండా జాసన్ సంజయ్ దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెడుతున్నారు. సిగ్మా అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అయితే ఈసినిమా టైటిల్ కార్డులో తన తండ్రి పేరుకు సంబంధించిన ఇన్షియల్ కాకుండా.. ఎస్ రావడం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఓవైపు విజయ్ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు దళపతికి తనయుడు సైతం దూరమవుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Cinema : అరె ఏంట్రా ఇది.. 15 ఏళ్లైనా నాగార్జున సినిమాకు తగ్గని డిమాండ్.. ఇప్పుడు ఓటీటీని అల్లాడిస్తోన్న మూవీ..

Follow Us