AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coolers Rent: ఎండాకాలంలో చల్లని కబురు.. కేవలం రూ.500కే అద్దెకు కూలర్లు.. ఆన్‌లైన్లో బుక్ చేస్తే నేరుగా ఇంటికే..

సమ్మర్‌లో చల్లదనం పొందాలనుకుంటున్నారా..? వేలకు వేలు ఖర్చు పెట్టిన ఏసీ, కూలర్ కొనుగోలు చేసే ఆర్ధిక స్తోమత మీకు లేదా..? అయితే నో ప్రాబ్లం. కేవలం నెలకు రూ.500కే అద్దెకు కూలర్లు లభిస్తున్నాయి. కేవలం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రధాన నగరాల్లో ఇలాంటి ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి.

Coolers Rent: ఎండాకాలంలో చల్లని కబురు.. కేవలం రూ.500కే అద్దెకు కూలర్లు.. ఆన్‌లైన్లో బుక్ చేస్తే నేరుగా ఇంటికే..
air Coolers
Venkatrao Lella
|

Updated on: Mar 12, 2026 | 3:04 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే మాడు పగిలేంతగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండ ప్రభావంతో పాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నాయి. మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. ఏప్రిల్ నాటికి రికార్డు స్థాయికి చేరుకునే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. వడగాల్పులు కూడా త్వరలోనే మొదలయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే ఎండల క్రమంలో హీట్ వేవ్ నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లల్లో ఏసీలు, కూలర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొంతమంది వీటిని ఈ మూడు నెలల కోసం రెంట్‌కి కూడా తెచ్చుకుంటున్నారు.

పెరుగుతున్న అద్దె మార్కెట్

హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల అద్దె మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సమ్మర్ కావడంతో వేడి నుంచి తప్పించుకుని చల్లదనం పొందేందుకు ఏసీలు, కూలర్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు ప్రజలు. కొత్త ఏసీ కొనాలంటే రూ.30 వేల పైమాటే. ఇక కూలర్ కొనాలన్నా రూ.10 వేలపైనే పడుతుంది. కొత్తవి కొనుగోలు చేసేందుకు ఆర్ధిక స్తోమత లేనివారు అద్దెకు తెచ్చుకుంటున్నారు. కేవలం నెలకు రూ.500కే కూలర్ అద్దెకు లభిస్తుంది. వేసవికాలం వస్తుండటంతో నగరంలో ఈ అద్దె కూలర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇక వీటిని అద్దెకు ఇచ్చే కంపెనీలకు కూడా బోల్డెంత ఆదాయం వస్తోంది. బ్యాచిలర్ రూమ్స్‌లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు వీటిని ఎక్కువగా రెంట్‌కు తీసుకుంటున్నారు. ఇక ఆర్ధిక స్తోమత లేని సామాన్య కుటుంబాలు కూడా కూలర్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు.

మూడు నెలల కోసం..

ఎక్కువగా సమ్మర్‌లో మూడు నెలల పాటు కూలర్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత కూలర్ అవసరం పెద్దగా ఉండదు. మూడు నెలల కోసం కొత్త కూలర్ కొనడం అవసరమా అని చాలామంది ఆలోచిస్తున్నారు. కొత్త కూలర్ కొన్నా ఎక్కువ కాలం పనిచేయవు. ఒక ఏడాది తర్వాత ఏదొక సమస్య తలెత్తుతూ ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుకు వచ్చే అద్దె కూలర్లను తెచ్చుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మూడు నెలల కోసం వేలల్లో ఖర్చు పెట్టడం అనవసరమనే భావనకు వస్తున్నారు. రోజూవారీ పనులు చేసుకుని జీవనం కొనసాగించేవారికి, బ్యాచిలర్లు వీటిని ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనే అద్దె ప్రతిపాదికన కూలర్ బుక్ చేసుకుంటే ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇక కూలర్ బ్రాండ్‌ను బట్టి నెలకు రూ.500 నుంచి రూ.800 వరకు అద్దె ఉంటుంది. అయితే కొంత మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రెంటల్ అప్లయన్సెస్ ప్లాట్‌ఫామ్‌లు ఆన్‌లైన్‌లో అనేకం అందుబాటులో ఉన్నాయి.

Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం