డెలివరీ బాయ్ దారుణం.. కస్టమర్ ముక్కు పగులగొట్టి!
బెంగళూరులో బ్లింకిట్‌కు చెందిన ఒక డెలివరీ బాయ్.. సరైన అడ్రస్‌కు రమ్మని చెప్పినందుకే కస్టమర్‌పై కోపం తెచ్చుకుని అమానుషంగా దాడి చేశాడు. మార్చి 7 అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2.00 గంటలకు బ్లింకిట్ యాప్ ద్వారా కస్టమర్ విలాయతిల్ కొన్ని వస్తువులను ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ ఏజెంట్ ఇంటికి రాకుండా వేరే లొకేషన్‌కు వెళ్లాడు. దీంతో కస్టమర్ ఫోన్ చేసి.. సరైన చిరునామాకు రావాలని కోరారు.
ఈ క్రమంలో ఫోన్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బాధితుడి ఇంటికి చేరుకున్న డెలివరీ బాయ్.. నేరుగా వితాయతిల్‌పై దాడికి దిగాడు. విచక్షణారహితంగా ముక్కుపై బలంగా గుద్దడంతో వితాయతిల్ కిందపడిపోయారు. దీంతో భయపడిపోయిన డెలివరీ బాయ్.. ఆర్డర్ చేసిన వస్తువులను అక్కడే పారేసి క్షణాల్లోనే పరారయ్యాడు. అయితే కాసేపటికే తేరుకున్న బాధితుడు తీవ్ర రక్తస్రావం కావడంతో.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడే పరీక్ష చేసిన వైద్యులు అతడి ముక్కు ఎముక విరిగినట్లు ధ్రువీకరించారు. అయితే ఓ వ్యక్తి దాడి చేయడం వల్లే అతడి ముక్కు ఎముక విరిగిపోవడంతో.. వైద్యులు పోలీసులను రంగంలోకి దింపారు. ఇలా బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

