చాట్‌జీపీటీ సాయంతో యువతులు ఆత్మహత్య.. షాకైన ఎలాన్ మస్క్
చాట్‌జీపీటీ లాంటి ఏఐ సాధనాలు మనిషికి వరమా? శాపమా? సూరత్‌కు చెందిన 18 ఏళ్ల ఇద్దరు యువతులు ప్రాణ స్నేహితులు. గత శుక్రవారం కాలేజీకి వెళ్లిన వారు సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి ఫోన్లను ట్రాక్ చేయగా.. సూరత్‌లోని ప్రసిద్ధ స్వామినారాయణ్ ఆలయం వద్ద వారి లొకేషన్ చూపించింది.
దీంతో వెంటనే వారు ఆలయానికి చేరుకున్నారు. అక్కడే ఆలయ ఆవరణలో వారి స్కూటర్ పార్క్ చేసి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. సీసీటీవి దృశ్యాలను పరిశీలించారు. దీంతో వారు ఆలయ వాష్‌రూమ్‌లోకి వెళ్లినట్లు తేలింది. అయితే లోపలికి వెళ్లిన వారు ఎంతకూ బయట రాలేదు. దీంతో పోలీసులే బాత్రూం లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతుల మృతదేహాల వద్ద అనస్థీషియా బాటిల్స్, సిరంజీలు లభించాయి. వారి ఫోన్లను అన్‌లాక్ చేసి చూడగా, వారి చాట్‌జీపీటీ సెర్చ్ హిస్టరీలో “ఆత్మహత్యకు ఏ డ్రగ్స్ వాడాలి?”, “సులభంగా ప్రాణాలు ఎలా తీసుకోవాలి?” వంటి ప్రశ్నలు ఉన్నాయి. గతంలో ఒక మహిళ అనస్థీషియా ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వారి గ్యాలరీలో కనిపించింది. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాచారంతోనే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించగా.. ఈ వార్త నెట్టింట వైరల్ అయింది.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!

