AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder QR Code: కీలక నిర్ణయం.. ఇక గ్యాస్‌ సిలిండర్లపై QR కోడ్.. దీని వల్ల ఉపయోగం ఏంటి?

LPG Cylinder QR Code: ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు డిజిటల్ గుర్తింపుతో రానున్నాయి. చాలా గ్యాస్ సిలిండర్లపై ఇప్పుడు QR కోడ్ అమర్చడం ప్రారంభించారు. చాలా గ్యాస్ సిలిండర్లపై ఇప్పుడు QR కోడ్ అమర్చడం ప్రారంభించారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ విధానం పైలట్‌..

LPG Cylinder QR Code: కీలక నిర్ణయం.. ఇక గ్యాస్‌ సిలిండర్లపై QR కోడ్.. దీని వల్ల ఉపయోగం ఏంటి?
Lpg Cylinder Qr Code
Subhash Goud
|

Updated on: Mar 12, 2026 | 12:49 PM

Share

LPG Cylinder QR Code: ఇప్పటివరకు ఇంట్లో ఉపయోగించే LPG సిలిండర్లు సాధారణ గుర్తింపుతో మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు అవి కూడా డిజిటల్ గుర్తింపుతో రానున్నాయి. చాలా గ్యాస్ సిలిండర్లపై ఇప్పుడు QR కోడ్ అమర్చడం ప్రారంభించారు. ఈ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేస్తే ఆ సిలిండర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. అంటే సిలిండర్ ఎప్పుడు నింపారు, ఏ ప్లాంట్‌లో నింపారు? అది ఎలా పంపిణీ అయింది వంటి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ క్యూఆర్‌ కోడ్‌ విధానం పైలట్‌ ప్రాజెక్టుగా గతంలో చేపట్టినప్పటికీ దీనిని ఇప్పుడు మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే యుద్ధం కారణంగా గ్యాస్‌ సిలిండర్ల కొరత, బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్లకుండా ఈ చర్యలు మరింత ఊపందుకున్నట్లు తెలుస్తోంది.

గ్యాస్ సిలిండర్ దొంగతనం, తక్కువ బరువు సమస్యలు తగ్గించడంతో పాటు పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ఆయిల్ కంపెనీలు ఈ కొత్త విధానాన్ని ప్రారంభించాయి.

ఇది కూడా చదవండి: LPG Crisis: ఇక సిలిండర్లతో పరేషాన్‌ వద్దు.. తక్కువ ధరల్లోనే 5 బెస్ట్‌ ఇండక్షన్ స్టౌవ్‌లు

ఇవి కూడా చదవండి

LPG సిలిండర్ QR కోడ్ అంటే ఏమిటి?

QR కోడ్ అనేది ఒక డిజిటల్ కోడ్. దీనిని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేయవచ్చు. ఎల్‌పీజీ సిలిండర్‌పై అమర్చిన ఈ కోడ్‌లో సిలిండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి ఉంటాయి.

స్కాన్ చేసిన వెంటనే ఈ వివరాలు కనిపిస్తాయి:

  • సిలిండర్‌కు సంబంధించిన యూనిక్ ఐడి నంబర్
  • సిలిండర్ నింపిన తేదీ
  • బాట్లింగ్ ప్లాంట్ వివరాలు
  • పంపిణీకి సంబంధించిన సమాచారం

ఈ విధంగా QR కోడ్ సిలిండర్‌కు ఒక డిజిటల్ గుర్తింపుగా పనిచేస్తుంది. దీనివల్ల సిలిండర్ పూర్తి చరిత్రను సులభంగా తెలుసుకోవచ్చు.

పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం

ఈ QR కోడ్ సిలిండర్లను మొదటగా ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. 2022లో Indian Oil Corporation Limited (IOCL) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దిల్లీలోని మదన్‌పూర్ ఖాదర్ బాట్లింగ్ ప్లాంట్‌లో మొదటగా QR కోడ్ ట్యాగింగ్‌ను పరీక్షించారు. ఈ ప్రాజెక్టుకు Petroleum and Explosives Safety Organisation (PESO) 2022 సెప్టెంబర్ 1 నుంచి మూడు నెలలపాటు అనుమతి ఇచ్చింది. తర్వాత ఈ అనుమతిని 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొత్త ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌కు ఎంత?

2022 నవంబర్ 27 నాటికి IOCL మొత్తం 23,827 QR కోడ్ ట్యాగ్ ఉన్న 14.2 కిలోల LPG సిలిండర్లనురెండు డిస్ట్రిబ్యూటర్లకు పంపింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని సిలిండర్లపై ఇంకా ఈ కోడ్ అమల్లో లేదు. రానున్న రోజుల్లో దశలవారీగా అన్ని సిలిండర్లపై ఈ క్యూఆర్‌ కోడ్ అమలు చేయాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

QR కోడ్ స్కాన్ చేస్తే ఏమి తెలుస్తుంది?

సిలిండర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే డేటా సిస్టమ్‌లో ఓపెన్ అవుతుంది. దీంతో ఈ కింది వివరాలు తెలుసుకోవచ్చు:

  • సిలిండర్ ఎక్కడ పంపారు.
  • ఎప్పుడు నింపారు
  • ఏ డిస్ట్రిబ్యూటర్‌కు పంపించారు
  • దీంతో కంపెనీలకు సిలిండర్ల ట్రాకింగ్, ట్రేసింగ్ చాలా సులభం అవుతుంది. ఎక్కడైనా సిలిండర్ మాయం అయినా లేదా దుర్వినియోగం జరిగినా వెంటనే గుర్తించడం సాధ్యమవుతుంది. మొత్తం మీద సిలిండర్‌ నింపడం నుంచి దానిని సప్లే చేసే వరకు అన్ని వివరాలు సులభంగా తెలిసిపోతాయి.

దొంగతనం, తక్కువ బరువు సమస్యలకు చెక్ , గ్యాస్ సిలిండర్ దొంగతనం, గ్యాస్ దుర్వినియోగం, తక్కువ బరువు సిలిండర్లపై ఫిర్యాదులు ఆయిల్ కంపెనీలకు చాలా కాలంగా సమస్యగా ఉన్నాయి. QR కోడ్ వ్యవస్థ అమలులోకి వస్తే ప్రతి సిలిండర్‌పై పర్యవేక్షణ సాధ్యమవుతుంది. సిలిండర్ ఎక్కడికి వెళ్లింది, దాని పరిస్థితి ఏమిటి అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా కంపెనీలకు ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, సరఫరా వ్యవస్థపై కూడా మెరుగైన నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Elon Musk: X యూజర్లకు భారీ షాక్‌.. ఇప్పుడు ‘గ్రోక్’ (Grok)ను అలా వాడలేరు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us