Tata Nexon EV: టాటా నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 437 కిలోమీటర్లు..

Tata Nexon EV: టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల రేంజ్‌ను విస్తరించే క్రమంలో మరో కొత్త కారును లాంచ్‌ చేసింది. టాటా ఇప్పటికే లాంచ్‌ చేసిన నెక్సాన్‌కు అప్‌డేటేడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చింది. మే 11న ఈ కారు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది...

Tata Nexon EV: టాటా నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 437 కిలోమీటర్లు..
Tata Nexon Ev
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2022 | 4:55 PM

Tata Nexon EV: టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల రేంజ్‌ను విస్తరించే క్రమంలో మరో కొత్త కారును లాంచ్‌ చేసింది. టాటా ఇప్పటికే లాంచ్‌ చేసిన నెక్సాన్‌కు అప్‌డేటేడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చింది. మే 11న ఈ కారు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ లేటెస్ట్‌ కారులో అత్యాధునిక ఫీచర్లను అందించారు. ప్రస్తుతం భారత్‌లో ఎక్కువగా అమ్మకాలు అవుతోన్న ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నెక్సాన్‌ ఈవీకి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే మార్కెట్‌ను మరింత పెంచుకునే ఉద్దేశంతో ఈ కొత్త కారును లాంచ్‌ చేశారు.

కంపెనీ ఈ కారును ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 40.5 కేడబ్ల్యూహెచ్‌ లిథియం-ఐయాన్‌ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 437 కి.మీ ప్రయాణిస్తుంది. ఇక 56 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్‌ చేసుకోవడం ఈ కారు మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. పేరుకు ఎలక్ట్రిక్‌ కారు అయినా స్పీడ్‌ విషయంలో ఏమాత్రం తక్కువ ఉండదు. కేవలం 9 సెకన్లలో 0 – 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. కారు ఇంజిన్‌ 250 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ దగ్గర 105 కేడబ్ల్యూ శక్తిని విడుదల చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇందులో వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, ఆటో డిమ్మింగ్‌ ఐఆర్‌వీఎం వంటి అధునాతన ఫీచర్లను అందించారు. అలాగే ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, రేర్‌ ఏసీ వెంట్స్‌, వెంటిలేటెడ్‌ లెదర్‌ సీట్లు, ఎయిర్‌ ప్యూరిఫయర్‌ లాంటివి ఇచ్చారు. ధర విషయానికొస్తే.. నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ధర రూ.17.74 లక్షలు కాగా.. మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ప్లస్ ధర రూ.18.24 లక్షలుగా ఉంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ జెడ్‌ప్లస్ లక్స్ ధర ఛార్జింగ్ ఆప్షన్ బట్టి రూ.18.74 లక్షలుగా, రూ.19.24 లక్షలుగా ఉంది.