Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: ట్విట్టర్‌ డీల్‌ తాత్కాలికంగా నిలిపివేత… స్పామ్‌, నకిలీ ఖాతాల లెక్కలు తేల్చాలన్న మస్క్‌

ట్విట్టర్‌లో తొలుత 9.2% వాటా కొనుగోలు చేసిన మస్క్‌ తర్వాత సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిరింది. ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున..

Elon Musk: ట్విట్టర్‌ డీల్‌ తాత్కాలికంగా నిలిపివేత... స్పామ్‌, నకిలీ ఖాతాల లెక్కలు తేల్చాలన్న మస్క్‌
Elon Musk Twitter Deal
Follow us
Sanjay Kasula

| Edited By: Narender Vaitla

Updated on: May 13, 2022 | 5:17 PM

ట్విట్టర్‌(Twitter) డీల్‌‌పై సంచనల ప్రకటన చేశారు ఎలన్‌ మస్క్‌(Elon Musk). ట్విట్టర్‌ డీల్‌ తాత్కాలికంగా ఆపేసినట్టు ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు. 44 బిలియర్‌ డాలర్లకు ట్విట్టర్‌న కొనుగోలు చేసేందుకు మస్క్‌ డీల్‌ చేసుకున్నారు. స్పామ్‌ , ఫేక్‌ ఖాతాల వివరాలు తమకు తెలియాలంటున్నారు మస్క్‌. అయతే అలాంటి ఖాతాలు ఐదు శాతం లోపలే ఉన్నట్టు ట్విట్టర్‌ యాజమాన్యం వెల్లడించింది. ట్విట్టర్‌లో తొలుత 9.2% వాటా కొనుగోలు చేసిన మస్క్‌ తర్వాత సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిరింది. ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 46.5 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని మస్క్‌ ప్రకటించారు.

బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ ప్రస్తుతం హోల్డ్‌లో ఉందని ట్వీట్ వెనుక ఎలన్‌ మస్క్‌ స్పామ్.. నకిలీ ఖాతాలను పేర్కొన్నాడు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ఇటీవలే ప్రకటించారు. టెస్లా యజమాని ఎలోన్ మస్క్ చేసిన ఈ ప్రకటనకు ముందు ట్విట్టర్ తన ఇద్దరు టాప్ మేనేజర్లను గురువారం తొలగించింది.

ఇదిలావుంటే.. ట్విట్టర్ కంపెనీలో(Twitter) అలజడి మెుదలైంది. ఎలాన్ మస్క్ ఇప్పటికే ఉద్యోగుల కోత ప్రారంభించినట్లు తెలుస్తోంది. కంపెనీలో నుంచి ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటి​వ్స్ సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోతున్నట్టు ట్విట్టర్​ తాజాగా వెల్లడించింది. దీనికి తోడు కొత్త నియామకాలు కూడా ఇప్పటికే నిలిచిపోయాయి. ఈ విషయాలపై కంపెనీ సీఈవో పరాగ్ సైతం స్పందించారు.ట్విట్టర్​ కంపెనీలోని రీసెర్చ్​, డిజైన్​ మేనేజర్​ కేవోన్ బేక్‌పూర్​తో పాటు ప్రాడక్ట్​ హెడ్​ బ్రూస్​ ఫాల్క్​ కంపెనీని వీడారు. రానున్న రోజుల్లో మరింత మంది కంపెనీని వీడతారా అంటే.. అందుకు అవుననే సమాదానం వస్తోంది. కంపెనీని వీడాలని తనకు లేనప్పటికీ.. ఇలా చేయక తప్పపటం లేదని కేన్ తన మదిలోని మాటను వ్యక్తం చేశారు. ట్విట్టర్ ​తో తన బంధాన్ని ఇలా ముగించాలని అనుకోలేదని ఆయన అన్నారు. ఇదే విషయంపై సీఈవో పరాగ్ సైతం తనతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు.

కంపెనీలోని కీలకమైన పదవులకు తప్ప.. మిగిలిన విభాగాల్లో నియామకాలు పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ వెల్లడించటం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్​ కొనుగోలు విషయంలో 44 బిలియన్​ డాలర్ల డీల్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనిని పూర్తి స్థాయిలో ముగించే పనిలో పడ్డారు ఎలాన్ మస్క్.