Moon Soil: మొదటిసారిగా చంద్రుని నుంచి సేకరించిన మట్టిలో మొక్కల పెంపకం.. పరిశోధనలలో కీలక ముందుడుగు

Moon Soil: చరిత్రలో మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు చంద్రని నుంచి సేకరించిన మట్టిలో మొక్కలను పెంచారు. దీంతో అంతరిక్ష పరిశోధనలలో మరో కీలక ముందడుగు పడినట్లయ్యింది. ..

Moon Soil: మొదటిసారిగా చంద్రుని నుంచి సేకరించిన మట్టిలో మొక్కల పెంపకం.. పరిశోధనలలో కీలక ముందుడుగు
Follow us

|

Updated on: May 13, 2022 | 1:34 PM

Moon Soil: చరిత్రలో మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు చంద్రని నుంచి సేకరించిన మట్టిలో మొక్కలను పెంచారు. దీంతో అంతరిక్ష పరిశోధనలలో మరో కీలక ముందడుగు పడినట్లయ్యింది. నాసా యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి. పరిశోధకులు అపోలో 11,12, 17 మిషన్ల ద్వారా సేకరించిన మట్టి నమూనాలను అరబిడోప్సిస్‌ను పెంచడానికి ఉపయోగించారు. గురువారం కమ్యూనికేషన్స్‌ బయాలజీ జర్నల్‌లో ఈ సంచలనాత్మక ప్రయోగ వివరాలను వివరించారు. చంద్రుని నుంచి సేకరించిన మట్టిలో మొక్కలను పెంచడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న బోటనవేలు పరిమాణ కుండలలో వారు ఒక గ్రాము మట్టిని, నీటిని జోడించారు.

తర్వాత విత్తనాలు వేసి ప్రతి రోజు మొక్కలకు పోషక ద్రావణాన్ని కూడా వేశారు. వాటిని శుభ్రమైన గదిలో టెర్రిరియం బాక్సులలో ఉంచినట్లు నాసా (NASA) మే 12న ఒక ప్రకటనలో తెలిపింది. పోషకాలు లేని నెలకీ ప్రతిరోజు ఒక ద్రావణాన్ని జోడించినట్లు తెలిపారు. రెండు రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తడం పరిశోధకులను ఆశ్చర్యపర్చింది. మొక్కలు పెరగడం మేము ఎంతో ఆశ్చర్యపోయాము.. అని ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలోని హార్టికల్చరల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ తెలిపారు. ఆరు రోజుల తర్వాత మొక్క పెరగడంతో తేడాలు కనిపించినట్లు తెలిపారు. మొక్కలో కుంగిపోయిన మూలాలు కనిపించాయి. 20 రోజుల తర్వాత మొక్కలను పరిశీలించారు. మొక్కలు మరింత నెమ్మదిగా పెరిగాయి. ఎర్రటి వర్ణద్రవ్యం ఉన్నాయని నాసా తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి