Delhi Fire Accident: ఢిల్లీ దుర్ఘటనలో 27 మంది సజీవ దహనం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ

Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర ప్రమాదంలో 27 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Delhi Fire Accident: ఢిల్లీ దుర్ఘటనలో 27 మంది సజీవ దహనం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ
Pm Modi
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: May 14, 2022 | 12:19 PM

Delhi Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని ముంద్కా మెట్రోస్టేషన్‌ సమీపంలోని మూడంతస్తుల వాణిజ్య భవనంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరింది. ఈ ఘటనలో 27 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. కాగా.. మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందం సహాయం తీసుకోనున్నట్లు ఔటర్ జిల్లా డీసీపీ ఎస్ శర్మ తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కంపెనీ యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

కంపెనీ యజమానుల అరెస్ట్.. 

ఇవి కూడా చదవండి

కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయల్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. భవనం యజమాని మనీష్ లక్రాగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని.. మరియు త్వరలో పట్టుకుంటామని డీసీపీ సమీర్ శర్మ పేర్కొన్నారు. ముంద్కా మెట్రోస్టేషన్‌ పోల్ నంబర్ 544 దగ్గర జరిగింది. ఘటనాస్థలం నుంచి 60-70 మందిని కాపాడి బయటికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 4.40 గంటలకు సమాచారం అందగానే.. 24 ఫైర్ ఇంజన్లతో వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు సాయం..  

కాగా.. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం కేజ్రీవాల్ స్పందించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటన తనను తీవ్ర కలిచివేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటిస్తూ ప్రధాని కార్యాలయం ఈ సంర్భంగా ట్వీట్‌ చేసింది.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

Congress Conference: ఉత్సాహంగా కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిరం.. బీజేపీ సర్కార్‌పై నేతల ఫైర్..

ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?